Rakhi to Prime Minister Modi | కోరుట్ల, ఆగస్ట్ 7: పట్టణంలోని పీఎంశ్రీ ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినిలు తమ స్వహస్తాలతో తయారు చేసిన రాఖీని ప్రధాని నరేంద్ర మోడీకి పంపించారు. రక్షాబంధన్ సందర్భంగా ముందస్తు వేడుకలను గురువారం నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా పాఠశాల ఆవరణలో రాఖీని ప్రదర్శించారు.
ఆపరేషన్ సిందూర్ పేరుతో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై పోరులో విజయం సాధించిన వీర జవాన్లతో పాటూ ప్రధాని మోడీకి పోస్ట్ ద్వారా రాఖీలను పంపినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణమోహన్ రావు తెలిపారు. రాఖీ తయారు చేసిన భానుగ్న, సంజన, సాయిశ్రీ, శరణ్య, మనుశ్రీ, పూజ, లిఖితను అధ్యాపకులు అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు చావ్లా లక్ష్మీనారాయణ, చందా నాగరాజు, బాస సుమలత, పిస్క వేణు తదితరులు పాల్గొన్నారు.