గోదావరిఖని, సెప్టెంబర్ 17 : గతంలో రేవంత్‌రెడ్డి సోనియాగాంధీని బలిదేవత అని, రాహుల్‌గాంధీని ముద్దపప్పు అని తిట్టి, ఇప్పుడు వాటిని కవర్ చేసుకోవడానికి ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. మంగళవారం గోదావరిఖనిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తో కలిసి మాట్లాడారు. సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు బీఆర్ఎస్ హయాంలో కేబినెట్ తీర్మానం చేసిన స్థలంలో రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని సీఎం రేవంత్‌రెడ్డి దెబ్బతీశారని ధ్వజమెత్తారు.
తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ప్రజలతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి విగ్రహాన్ని సచివాలయం ఎదుట ఏర్పాటు చేయడం తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనన్నారు. తెలంగాణ సచివాలయాన్ని తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంతో అద్భుతంగా నిర్మించి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహంతోపాటు అమరవీరుల స్తూపం ఏర్పాటు చేశారని తెలిపారు.
సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్, కేటీఆర్‌పై ఇష్టారీతిన మాట్లాడుతూ వీధి రౌడీలా, గల్లీ లీడర్‌గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలను గౌరవించి అభివృద్ధికి పేద్దపీట వేశారని గుర్తు చేశారు. ఇచ్చిన మాటను, హామీని నిలబెట్టుకోవడంలో తొమ్మిది నెలల రేవంత్ సర్కార్ విఫలమైందన్నారు. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తాము వ్యతిరేకం కాదని, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు కేటాయించిన స్థలంలో రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటు సరికాదని హితవుపలికారు.
సమావేశంలో మున్సిపల్ కార్పొరేటర్లు పెంట రాజేశ్, పాముకుంట్ల భాస్కర్, బాదె అంజలి, గాదం విజయం, కల్వచర్ల కృష్ణవేణి, రమణారెడ్డి, నాయకులు నాయకులు నడిపెల్లి మురళీధర్‌రావు, పీటీ స్వామి, అచ్చె వేణు, బొడ్డు రవీందర్, చల్లగురుగుల మొగిళి, పిల్లి రమేశ్, చెలకలపల్లి శ్రీనివాస్, నూతి తిరుపతి, తోకల రమేశ్, సట్టు శ్రీనివాస్, యాసర్ల తిమోతి, రామరాజు, వడ్లూరి రాములు, రాజేశ్, మహేందర్, రమ్య, ముద్దసాని సంధ్యారెడ్డి, ఆవునూరి వెంకటేష్, పద్మ, లక్ష్మి పాల్గొన్నారు.