సిరిసిల్ల టౌన్, డిసెంబర్ 20: ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతున్నదని నాఫ్స్కాబ్ మాజీ చైర్మన్ కొండూరు రవీందర్రావు విమర్శించారు. ఫార్ములా ఈ-కార్ రేసుతో హైదరాబాద్‌కు బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని.. ఓర్వలేకే కాంగ్రెస్ సర్కారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్రమ కేసులు బనాయించిందన్నారు. దమ్ముంటే ఈ-కార్ రేసుపై అసెంబ్లీలో చర్చకు రావాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి రా చరికపు పాలన చేస్తున్నాడని మండిపడ్డారు.
ఈ మేరకు శుక్రవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లగచర్ల, మూసీ బాధితులతోపాటు ప్ర జా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పె ట్టిందన్నారు. ఈ-ఫార్ములా రేసు నిర్వహణ ద్వారా రాష్ర్టానికి పెట్టుబడులు వచ్చాయని, అనేక మంది ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు ఈ-కార్ రేసుపై ప్రశంసల జల్లు కురిపించారన్నారు. ఈ-కార్ రేసులో డబ్బులు దుర్వినియోగం కాలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ చెబుతున్నాడన్నారు.
ప్రభుత్వంలో నాయకులకు స్పష్టత లేకుండా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ, ఈ-కార్ రేసుతో హైదరాబాద్‌కు ప్రపంచంలోనే ఉత్తమ బ్రాండ్ ఇమేజ్ను తెచ్చిన ఘనత కేటీఆర్‌కు మాత్రమే దక్కుతుందన్నారు. డబ్బు సంచులతో దొరికిన దొంగకు ఎదుటి నాయకులంతా దొంగల మాదిరిగానే కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఆంధ్రా పాలకుల బూట్లు తుడిసిన నాయకుడు రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ మాట్లాడుతూ, ప్రశ్నించే గొంతుకలపై కాంగ్రెస్ సర్కారు అక్రమ కేసులు బనాయిస్తున్నదని మండిపడ్డారు.
కేటీఆర్‌పై కేసులు పె ట్టడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ సమాజం మొత్తం కేటీఆర్వైపు నిలబడుతుందన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకులు బొల్లి రా మ్మోహన్, న్యాలకొండ రాఘవరెడ్డి, దిడ్డి రా జు, దార్ల సందీప్, అన్నారం శ్రీనివాస్, బత్తు ల రమేశ్, కుంబాల మల్లారెడ్డి, బత్తుల వనజ, నర్మెట ప్రభుదాస్, వెంగళ శ్రీనివాస్, వీరబత్తిని కమలాకర్, తదితరులు పాల్గొన్నారు.