మల్యాల, మే 9: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానంలో ఆదివారం నుంచి మూడు రోజులపాటు హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు జరుగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం యాగశాల శుద్ధి చేసి అఖండ దీపాన్ని స్థాపించి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు.
వైశాఖ బహుళ దశమి రోజున ప్రతి సంవత్సరం కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి నిర్వహంచడం ఆచారంగా వస్తున్నది. ఈ క్రమంలో ఆదివారం జయంతి ఉత్సవాలు ప్రారంభమై చివరి రోజైన మంగళవారంతో ముగియనున్నాయి.