మల్యాల, జనవరి 29 : కొండగట్టు అంజన్న ఆలయానికి వేలం పాటల్లో భారీ ఆదాయం సమకూరింది. సన్నిధానంలో భక్తులకు అవసరమయ్యే 13 రకాల దుకాణాల నిర్వహణ కోసం బహిరంగ వేలం పాట కం షీల్డ్ టెండర్, ఈ- టెండర్ ప్రక్రియ నిర్వహించగా 3.88 కోట్లు వచ్చాయి. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు దుకాణం నిర్వహణకు కరీంనగర్లోని దేవాదాయ ధర్మాధాయశాఖ కార్యాలయంలో టెండర్ ప్రక్రియ నిర్వహించినట్టు ఆలయ ఈవో టంకశాల వెంకటేశం, అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ తెలిపారు.
మొత్తంగా ఆలయానికి 3,88,41,221 ఆదాయం సమకూరిందని, ఇది ప్రస్తుత ఏడాది ధరలతో పోలిస్తే 1,14,70,950 అధికంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తిరుక్కోవెళూర్ మారుతీస్వామీ, ఆలయ ఏఈవో బుద్ది శ్రీనివాస్, పర్యవేక్షకులు శ్రీనివాసశర్మ, సునీల్, సెక్షన్ ఇన్చార్జి ఉమామహేశ్వర్రావు పాల్గొన్నారు.