Jagityala SP | మల్యాల : జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో మే 20 నుండి 23వరకు నిర్వహించిన హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలలో ప్రత్యేక పాత్ర పోషించిన పోలీస్ శాఖకు కొండగట్టు అంజన్న ఆలయ ఈవో శ్రీకాంత్ రావు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో అశోక్ కుమార్ ను స్వామివారి శేష వస్త్రంతో సత్కరించడంతోపాటు లడ్డు ప్రసాదాలను అందజేశారు. జయంతి ఉత్సవాల విజయవంతంలో పోలీస్ శాఖ నిర్వహించిన పాత్ర ప్రత్యేకమని, ఉత్సవాలను విజయవంతం చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట ఆలయ పర్యవేక్షకుడు సునీల్ గౌడ్ తదితరులు ఉన్నారు.