Konda Lakshman Bapuji | పెగడపల్లి : స్వాతంత్ర్య సమరయోధుడు, మలి దశ తెలంగాణ ఉద్యమ కారుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు ఆదివారం పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం లక్ష్మణ్ బాపూజీ చేసిన పోరాటాలను, త్యాగాలను గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మండల పద్మశాలి సేవా సంఘం అధ్యక్షుడు గాజుల గంగ మల్లేశం, చేనేత ఐక్య వేదిక మండల అధ్యక్షుడు ఎలగొండ వెంకట రమణ, మండల ప్రధాన కార్యదర్శి అందే వెంకటేశం, క్యాషియర్ బోగ గోపి, మండల కార్యదర్శి గంగాధర్, మండల ఉపాధ్యక్షులు గాలిపల్లి సత్తయ్య, పద్మశాలి పెగడపల్లి టౌన్ అధ్యక్షులు గాజుల నర్సయ్య, సుద్దపల్లి అధ్యక్షులు గంట్యాల లింగయ్య, నాయకులు, జిల్లా పోపా కార్యదర్శి కట్ల రమేష్, గుర్రం సాగర్, గుర్రం తిరుపతి, కొప్పుల కుమార్, లైశెట్టి శంకరయ్య, గంట్యాల వెంకటేష్, రాజేశం తదితరులు పాల్గొన్నారు.