MLA Vijaya Ramana Rao | ఓదెల, జనవరి 17 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు గ్రామంలోని గుట్టల్లో వెలసిన సమ్మక్క_ సారలమ్మ జాతర పురాతనమైనదిగా పేరుగాంచినట్లు ఎమ్మెల్యే విజయ రమణారావు పేర్కొన్నారు. శనివారం కొలనూరులోని సమ్మక్క జాతర వాల్ పోస్టర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మేడారం సమ్మక్క జాతర తర్వాత కొలనురు సమ్మక్క జాతరకు అంత ప్రాశస్త్యం ఉందన్నారు. ఇక్కడ మొక్కలు పెట్టుకున్న భక్తులు ఇక్కడికే వచ్చి మళ్లీ మొక్కలు చెల్లిస్తారన్నారు.
మహారాష్ట్ర తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి భారీగా భక్తులు రానున్నడంతో జాతరలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. జాతరకు ఇరువైపులా రోడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి రూపాయలు రూ.95 లక్షలతో జాతర జరిగే స్థలం వరకు తారు రోడ్డును 20 రోజుల్లోనే పూర్తి చేయించినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా జాతరను సవ్యంగా నడుపుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బైరి రవి గౌడ్, సర్పంచ్ పల్లె కనకయ్య, జాతర కమిటీ చైర్మన్ కొలిపాక మధునయ్య, వైస్ చైర్మన్ సట్ల సదయ్య గౌడ్, మాజీ సర్పంచ్ ఢిల్లీ శంకర్, నాయకులు రేగుల తిరుపతి, జక్కుల మధు యాదవ్, యసం శ్రీనివాస్, సామ తిరుపతి, జాతర కమిటీ సభ్యులు మేకల సమ్మయ్య, పోతర్ల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.