Chigurumamidi | చిగురుమామిడి, జూన్ 16 : చిగురుమామిడి తహసీల్దార్‌గా కోడం కనకయ్య నియమితులయ్యారు. కనకయ్య వీణవంక, తిమ్మాపూర్, కరీంనగర్ అర్బన్, హుజురాబాద్, గన్నేరవరం మండలాల్లో విధులు నిర్వహించి బదిలీపై చిగురుమామిడికి రానున్నారు.
ఆయా మండలాల్లో విధి నిర్వహణలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక్కడ విధులు నిర్వహించిన తహసీల్దార్ ముద్ధసాని రమేష్ కు పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది.