Khammam Collector Anudeep | మల్లాపూర్ 3: ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తన కుటుంబ సభ్యులతో కలిసి విజయ దశమి వేడుకల్లో పాల్గొనడానికి తన స్వగ్రామం మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి వచ్చారు. ఈ వేడుకల్లో గ్రామస్తులు, యువకులు, విద్యార్థులు కలెక్టర్ ను కలిసి జమ్మి ఆకు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా అనుదీప్ యువకులనుద్దేశించి మాట్లాడుతూ యువత సెల్ ఫోన్లు, దురలవాట్లకు బానిసలు కావద్దని చదువుపట్ల దృష్టి పెట్టాలని, చదువే మనల్ని సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెడుతుందని ఉద్బోధించారు. గురువారం రాత్రి గ్రామంలో జరిగిన దుర్గామాత శోభాయాత్ర లో పాల్గొని పూజలు నిర్వహించగా, అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ప్యాక్స్ చైర్మన్ మోహన్ రెడ్డి, కొత్తపల్లి రాజారెడ్డి, రాజేందర్, కట్కం నర్సారెడ్డి, మైలారం సురేష్, అజయ్, బాలసాని లక్ష్మీనారాయణ, సురకంటి హనుమాండ్లు, బొల్లపెల్లి శ్రీనివాస్ గౌడ్, గుజ్జెరి శ్రీనివాస్, బర్ల మల్లేష్, విష్ణువర్ధన్ రాజు తదితరులు పాల్గొన్నారు.