ప్రతి ఇంటిపైనా జెండా ఎగురాలి
ప్రజలు, యువతలో దేశభక్తి భావన పెంపొందేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని అధికారులను రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. ఆగస్టు 15న ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగురాలని, ఆ మేరకు 9వ తేదీ నుంచే ఇంటింటికీ పతాకాలను పంపిణీ చేయాలని సూచించారు. విద్యార్థులు మొదలుకొని ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువతీయువకులు
- ఈ నెల 8 నుంచి 20 వరకు వజ్రోత్సవాలు నిర్వహించాలి
- దేశభక్తి భావన పెంపొందేలా కార్యక్రమాలు ఉండాలి
- ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలి
- సన్నాహక సమావేశంలో అధికారులకు మంత్రి గంగుల కమలాకర్ ఆదేశం
కార్పొరేషన్, ఆగస్టు 4 : ప్రజలు, యువతలో దేశభక్తి భావన పెంపొందేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని అధికారులను రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. ఆగస్టు 15న ప్రతి ఇంటిపైనా జాతీయ జెండా ఎగురాలని, ఆ మేరకు 9వ తేదీ నుంచే ఇంటింటికీ పతాకాలను పంపిణీ చేయాలని సూచించారు. విద్యార్థులు మొదలుకొని ఉద్యోగులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, యువతీయువకులు ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.
వజ్రోత్సవాల నిర్వహణపై కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం జిల్లాస్థాయి అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్ర సర్కారు వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నదన్నారు. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తి ప్రజలందరిలో కలిగేలా ఈ నెల 8 నుంచి 20వరకు కార్యక్రమాలను నిర్వహించాలని, ఆ మేరకు విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఆగస్టు 15న కరీంనగర్ జిల్లాలో 3,08,427 గృహాలపై జాతీయ జెండాలను ఎగురవేయాలని, ప్రతి ఒకరూ భాగస్వాములను చేయాలని సూచించారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ నెల 8న వజ్రోత్సవ వేడుకల ప్రారంభోత్సవ సమారోహాన్ని చేపట్టాలన్నాఉ.
ఈ నెల 11న ఫ్రీడం రన్‌ను అంబేద్కర్ స్టేడియం నుంచి తెలంగాణ చౌక్ వరకు 50వేల మందితో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్, జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, నగర మేయర్ వై సునీల్‌రావు, అడిషనల్ కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యామ్‌ప్రసాద్ లాల్, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

