KTR | తిమ్మాపూర్,ఆగస్టు13: తిమ్మాపూర్ మండలం అల్గునూరులోని ఓ ఫంక్షన్ హాల్ లో జరిగిన వివాహ వేడుకకు హాజరైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ను బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తిమ్మాపూర్ లో పార్టీ పరిస్థితులపై ఇరువురు చర్చించుకున్నారు. ప్రజల పక్షాన నిలబడి కొట్లాడాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను గ్రామస్థాయిలో ఎండగట్టాలని సూచించారు.