ECET | ముత్తారం, మే 25: తెలంగాణ ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహిచిన ఈ సెట్ పరీక్ష ఫలితాల్లో మండలంలోని కేశనపల్లి గ్రామానికి చెందిన బండారి మణిదీప్ మైనింగ్ ఇంజనీరింగ్ విభాగంలో 5వ ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. మొత్తం 200 మార్కులకు గాను 109 మార్కులు సాధించాడు. ఈ సెట్ లో మంచి ర్యాంక్ సాధించిన బండారి మణిదీప్ ను ఈ సందర్భంగా పలువురు అభినందించారు.