కరీంనగర్ విద్యానగర్, జూలై 15 : కరీంనగర్ డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ (కేడీసీసీబీ) ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు మంగళవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా బ్యాంక్ అధ్యక్షుడు కొండూరు రవీందర్రావు, సీఈవో సత్యనారాయణరావు అవార్డు అందుకున్నారు.
44వ నాబార్డ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రైతులకు ఉత్తమ సేవలు అందించినందుకు ఈ అవార్డుకు ఎంపిక చేశారు. రాష్ట్రంలో గ్రామీణ రుణ పంపిణీ, సహకార పాలన ఆర్థిక చేరిక, ఆదర్శప్రాయమైన కృషికి అవార్డు వచ్చిందని, ఇది రావడానికి కృషిచేసిన ఉద్యోగులకు, ఖాతాదారులకు బ్యాంకు చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు.