Odela | ఓదెల, ఫిబ్రవరి 17: పెద్దపల్లి జిల్లా ఓదెల లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన పురస్కరించుకొని బీఆర్ఎస్ నాయకులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో కేసీఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి ప్రజలకు స్వీట్లు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కెసిఆర్ చావు అంచుదాకా వెళ్లి వచ్చిండని కొనియాడారు.
కేసీఆర్ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఐరెడ్డి వెంకటరెడ్డి, మాజీ జడ్పిటిసి గంట రాములు యాదవ్, బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు మ్యాడాగోని శ్రీకాంత్ గౌడ్, సర్పంచులు కనికి రెడ్డి సతీష్, మద్దవేని రవి, గ్యార వేణి విజయ౼ నాగరాజ్, నాయకులు ఆరెల్లి మొండయ్య గౌడ్, పోలోజు రమేష్, బోడగుంట నరేష్, చింత మొగిలి, రౌతు జలపతి, మద్దెల శ్రీనివాస్, గోచిక లింగమూర్తి, దేవీలాల్, పోతుగంటి రాజు, ఒజ్జె శ్రీనివాస్, బోగే సదానందం, చింతం వెంకటస్వామి, బుద్ధే పోశెట్టి, బుద్దే కుమార్, శ్రావణ్, ఓదెల నరేందర్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.