Chigurumamidi | చిగురుమామిడి, ఫిబ్రవరి 17: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం పురస్కరించుకొని చిగురుమామిడి మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాజరైన జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన కృషి మరువలేనిదన్నారు.
భవిష్యత్ తరాలకు మార్గదర్శకుడిగా ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాడని కొనియాడారు. బిఆర్ఎస్ పాలనలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందన్నారు. ప్రజల హృదయాల్లో బిఆర్ఎస్ స్థిరస్థాయిగా నిలిచిపోయిందని కొనియాడారు.
ఈ జన్మదిన వేడుకల్లో సింగిల్ విండో మాజీ చైర్మన్ జంగా రమణారెడ్డి, ఆర్ బి ఎస్ జిల్లా మాజీ సభ్యుడు సాంబారి కొమురయ్య, ఆర్బిఎస్ మండల మాజీ అధ్యక్షుడు పెనుకుల తిరుపతి, మండల మాజీ అధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, మండల నాయకులు సర్వర్ పాషా, బెజ్జంకి రాంబాబు, అనుమాండ్ల సత్యనారాయణ, కత్తుల రమేష్, బెజ్జంకి లక్ష్మణ్, కరివేద మహేందర్ రెడ్డి, ఆకవరం శివప్రసాద్, కత్తుల ప్రశాంత్, కొమ్మెర భూపతిరెడ్డి,సన్నిల్ల వెంకటేశం, బోయిని శ్రీనివాస్, ఎస్కే సిరాజ్,సన్నిల్ల మల్లేశం,యాల్ల జనార్దన్ రెడ్డి, కల్వల సంపత్ రెడ్డి, గిట్ల తిరుపతి రెడ్డి, శ్యామకూర సంపత్ రెడ్డి, కాశబోయిన రాజు, కిష్టారెడ్డి, కందుకూరి శ్రీనివాస్, బాపురెడ్డి, దశరథం తదితరులున్నారు. కాగా నవాబ్ పేట్ గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షుడు పిల్లి వేణు, కూతురు శరభంద రెడ్డి ఆధ్వర్యంలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.