KCR birthday | గంగాధరలో ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలను మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు ఆధ్వర్యంలో గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.
KCR birthday | గంగాధర, ఫిబ్రవరి 17 : బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలను మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మేచినేని నవీన్ రావు ఆధ్వర్యంలో గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ కేకును బీఆర్ఎస్ నాయకులతో కలసి కట్ చేశారు. అనంతరం నాయకులు ప్రజలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఉద్యమాన్ని చేపట్టారని గుర్తు చేశారు.
పదవులను తృణప్రాయంగా త్యజించి, ఆమరణ నిరాహార దీక్ష చేసి, చావు నోటి వరకు వెళ్లి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని కొనియాడారు. కేసీఆర్ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. కేసీఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాగి మహిపాల్ రావు, సర్పంచు వేముల దామోదర్, నాయకులు కంకణాల విజయేందర్ రెడ్డి, ఆకుల మధుసూదన్, మడ్లపెల్లి గంగాధర్, రామిడి సురేందర్, ముక్కెర మల్లేశం పుట్కం రవీంద్రనాథ్ ఠాగూర్, దూలం శంకర్ గౌడ్, పంజాల అంజనేయులు, జోగు లక్ష్మీరాజ్యం, వడ్లూరి ఆదిమల్లు గడ్డం స్వామి, ఎండి అబ్బాస్, రాచూరి మల్లేశం, లింగాల దుర్గయ్య, దోమకొండ మల్లయ్య, వేముల శ్రీధర్, జలంధర్ రెడ్డి, గంగాధర సంపత్, నరకుళ్ళ గంగయ్య, నిమ్మనవేని ప్రభాకర్, గుంటుకు ఆంజనేయులు, మామిడిపల్లి అఖిల్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

