రామడుగు, జనవరి11: తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి కేంద్రబిందువుగా నిలుస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని షానగర్, వెదిర గ్రామాల్లో పల్లె దవాఖాన పథకంలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్ర భవన నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం దేశరాజ్‌పల్లిలో రూ.94 లక్షల 94వేల 906 తో చేపట్టిన రైతువేదిక, సీసీరోడ్లు, మురుగునీటి కాలువ నిర్మాణం, ఆరోగ్య ఉపకేంద్రం, వైకుంఠధామం, నీటిశుద్ధి కేంద్రంతో పాటు మనఊరు -మనబడి పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మోతె ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా నేడు వందల కోట్లతో వరదకాలువకు తూములను ఏర్పాటు చేసి కాలువల ద్వారా సాగునీటిని అందించేందుకు కృషి చేయడం జరిగిందన్నారు. రైతుల సమస్యలను అధికారులు, ప్రభుత్వానికి తెలిపేందుకు ప్రతి మండలంలో రైతువేదికలను నిర్మించారన్నారు. ప్రజల ఆరోగ్యాలను కాపాడుకునేందుకు పల్లెదవాఖాన నిర్మాణాలు చేపట్టామన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎంపీపీ కలిగేటి కవిత, జిల్లా వైద్యాధికారి జువేరియా, ఎంఈవో అంబటి వేణుకుమార్, ఏఎంసీ చైర్మన్ మామిడి తిరుపతి, జడ్పీ కోఆప్షన్ మెంబర్ శుక్రొద్దీన్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్‌రెడ్డి, తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, సర్పంచులు నాగుల సంగీత-రాజశేఖర్‌గౌడ్, సైండ్ల కవిత- కరుణాకర్, రమేశ్, ఎంపీటీసీలు వంచ మహేందర్‌రెడ్డి, తొరికొండ అనిల్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు వీర్ల సంజీవరావు, ఏఎంసీ మాజీ చైర్మన్లు గంట్ల వెంకటరెడ్డి, లచ్చయ్య, ఏడీఏ రామారావు, ఏవో యాస్మిన్, పీఆర్ ఏఈ సచిన్, బీఆర్ఎస్ నాయకులు కలిగేటి లక్ష్మణ్, గునుకొండ అశోక్‌కుమార్, మినుకుల తిరుపతి, పెంటి శంకర్, సైండ్ల శ్రీనివాస్, పర్లపెల్లి మహేశ్, తిరుపతి, బాబు, జంగిలి శ్రీనివాస్, పంజాల జగన్మోహన్గౌడ్, జంగిలి రాజమౌళి, శనిగరపు అర్జున్, శ్రీనివాస్‌రెడ్డి, నారాయణ, జగన్మోహన్రెడ్డి, అనిల్‌రావు, లక్ష్మీపతి, దొబ్బల మధు, ఎల్లేశ్కుమార్ పాల్గొన్నారు.
రామడుగు, జనవరి11 : రుద్రారం గౌడసంఘం భవన నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ను గంగాధర మండలం బూర్గుపల్లిలో రుద్రారం ఎంపీటీసీ గుర్రం దేవికా రాజశేఖర్‌గౌడ్, గౌడసంఘం సభ్యులు కలిసి శాలువాతో సత్కరించారు. నిధులను మంజూరు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకుడు కలిగేటి లక్ష్మణ్, గౌడసంఘం సభ్యులు గుర్రం అంజిబాబుగౌడ్, గాంధీగౌడ్, నారాయణగౌడ్, శంకరయ్యగౌడ్, తిరుపతిగౌడ్, అంజయ్యగౌడ్, నాగుల చంద్రయ్యగౌడ్, ఏగోలపు కరుణాకర్‌గౌడ్, గుర్రం రాములుగౌడ్, లచ్చయ్యగౌడ్, నారాయణగౌడ్ ఉన్నారు.
చొప్పదండి, జనవరి 11: సాంబయ్యపల్లి గ్రామ పంచాయతీ నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ సర్పంచ్ కొత్తపల్లి రామకృష్ణ, బీఆర్ఎస్ నాయకులు బూర్గుపల్లిలోఎమ్మెల్యే సుంకెరవిశంకర్ను కలిసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, బీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు మాచర్ల రవీందర్, మండల ప్రధానకార్యదర్శి ఉదారం వేణు, కౌన్సిలర్ కొత్తూరి మహేశ్, నాయకులు సందవేని సతీశ్, కాల్వ అనిల్‌కుమార్ పాల్గొన్నారు.
చొప్పదండిలోని జీఆర్ఆర్ గార్డెన్ ఆవరణలో ఈ నెల 16న నిర్వహించే యేసుక్రీస్తు-వాగ్దాన పండుగ పోస్టర్‌ను ఎమ్మెల్యే సుంకెరవిశంకర్ బుధవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో హోలీషాలోమ్ చర్చి వ్యవస్థాపకుడు డా.గుండేటి శాంతికుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, కౌన్సిలర్ కొత్తూరి మహేశ్, నాయకులు నలుమాచు రామకృష్ణ, మహేశుని మల్లేశం పాల్గొన్నారు.