Korukanti Chande | గోదావరిఖని : తెలంగాణ రాష్ట్ర ఉద్యమ మహానేత తొలి సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేశారని, బీఆర్ఎస్ హయాంలోనే మహిళల సంక్షేమం జరిగిందని, ఆడబిడ్డలను కంటికి రెప్పలా కాపాడిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. రాబోవు కాలంలో కేసీఆర్ పాలన రావాలని, సంక్రాంతి పండుగ సందర్భంగా జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ మహీళమణులంతా ముగ్గులు వేయాలని పిలుపునిచ్చారు. గోదావరిఖని పట్టణం జీఎం కాలనీ గ్రౌండ్ మైదానంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా సోమవారం ముగ్గుల పోటీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల కెసీఆర్ పాలనలో మహిళలకు బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ చీరలు, పేదింటి ఆడబిడ్డలకు పెళ్లిళ్లకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా రూ.లక్ష నూటపదహార్లు అందించింది కేసీఆర్ అన్నారు. మహిళా సంక్షేమానికి కేసీఆర్ పాలన పెట్టింది పేరని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఉద్యమానికి ఈ మహిళ లోకమంతా అండగా నిలిచారని ముగ్గులతో జై తెలంగాణ నినాదాలతో తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్నారని గుర్తుచేశారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ఆడబిడ్డలకు జరిగింది ఏమీ లేదని, రెండు సంవత్సరాలుగా బతుకమ్మ పండుగకు బతుకమ్మ చీరలు అందించలేకపోయిందని మండిపడ్డారు.
రాష్ట్ర ప్రజలంతా కాంగ్రెస్ పాలన పట్ల విసిగిపోయారని కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటున్నారని అన్నారు. అనంతరం ముగ్గుల పోటిల్లో విజయం సాధించిన మహీళలకు బహుమతులు అందించారు. మెదటి బహుమతి పద్మకు రూ.10 వేలు, ద్వితీయ బహుమతి దుర్గం రేణుకకు రూ.5 వేలు, మూడో బహుమతి దివ్యకు రూ.3 వేలు అందజేశారు. అలాగే ముగ్గుల పోటీల్లో పాల్గొన్న 100 మంది మహిళలకు చీరలను చందర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌశిక హరి, మూల విజయ రెడ్డి, పాముకుంట్ల భాస్కర్, కుమ్మరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.