Dasari Manohar Reddy | పెద్దపల్లి, జూన్2: ఎన్నో ఎండ్ల తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్రం ఆకాంక్షను నేరవెర్చి.. పదేండ్లు సుపరి పాలన అందించి… దేశంలోనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపిన తెలంగాణ తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తిరిగి ముఖ్య మంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు బలంగా కొరుకుంటున్నారని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలంలో ప్రజల బతుకులను ఆగమాగం చేసిందని విమర్శించారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర ఆస్పత్రి ముందు బీఆర్ఎస్ పార్టీ జెండాను(గులాబీ) ఎరగవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సచ్చుడో… తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో చావు నోట్లో తలకాయ పెట్టి, అమర నిరాహార దీక్ష చేపట్టి ప్రత్యక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కలను సాకారం చేసిన మహానీయుడు కేసీఆర్ అని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరుతో ప్రజా సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రం వెనకబడిందని పేర్కొన్నారు.
రాష్ట్ర బాగుపడాలంటే తిరిగి కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రం ఏర్పడి 11 వసంతాలు పూర్తి అయిన నేపథ్యంలో ప్రజలందురూ పండుగ వాతవరణంలో అవతరణ దినోత్సవ వేడుకలను సంతోషంగా జరుపుకుంటున్నారని తెలిపారు. కార్యక్రమంలో నాయకలు ఉప్పు రాజ్‌కుమార్, పూదరి చంద్రశేఖర్, పెంచాల శ్రీధర్, లైసెట్టి భిక్షపతి, వైద శ్రీనివాస్, చంద్రమౌళి, బొడ్డుపల్లి రమేష్, అజీజ్, రవీందర్, శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు.