KTR Sena | సిరిసిల్ల రూరల్, జూలై 3: కేసీఆరే మన రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని, మూడోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని కేటీఆర్ సేన తంగళ్లపల్లి మండలాధ్యక్షుడు నందగిరి భాస్కర్ గౌడ్ పేర్కొన్నారు. తంగళ్లపల్లి మండలం మండెపల్లిలో గురువారం కేటీఆర్ సేన గ్రామ కమిటీని సింగిల్‌విండో చైర్మన్ బండి దేవదాస్ తోపాటు గ్రామ బీఆర్ఎస్ నేతల సమక్షంలో నియామకం చేపట్టారు. కేటీఆర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా బండి ప్రశాంత్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేసీఆర్ మూడోసారి సీఎంగా చేయడం కోసం పనిచేస్తామని, విశ్రమించబోమన్నారు.
కేటీఆర్ సేన ను గ్రామ గ్రామాన విస్తరిస్తామని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయడానికి ఆహర్నిషలు కృషి చేస్తామన్నారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హమీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. రైతు భరోసా 15 వేలకు బదులు 12 వేలు ఇస్తున్నారాన్నారు. రెండు దఫాల రైతు బంధు పైసలు ఎగవేశారని, రుణమాఫీ పూర్తి చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీ లు, 420 హామీలు అమలు చేసేదేకా ప్రశ్నిస్తామని, అమలు చేసేదాక ప్రజల పక్షాన ఉంటూ పోరాడుతామన్నారు.
అంతకుముందు సింగిల్‌విండో చైర్మన్ బండి దేవదాస్ గౌడ్ మాట్లాడుతూ కేటీఆర్ సేనకు సంపూర్ణ సహకారం అందిస్తామని, కేటీఆర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు. అనంతరం ఎన్నికైన కేటీఆర్ సేన గ్రామ కమిటీ అధ్యక్షుడు ప్రశాంత్ గౌడ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామశాఖ ఆధ్యక్షుడు డాక్టర్ నక్క రవి, మండల ప్రధాన కార్యదర్శి గనపమదన్రెడ్డి, మాజీ ఎంపీటీసీ బుస్స స్వప్న, లింగం, తిరుపతి, ప్రభుదాస్, బండి కృష్ణబాబు, ప్రసాద్, అజయ్, రమేష్, రాజేష్, మల్లేశం, ఎల్లయ్య, బన్నీ అనుష్, రమేష్ తదితరులు ఉన్నారు.