Manthani | మంథని, ఫిబ్రవరి 17: పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశ చిత్రపటంలోనే అగ్రస్థానంలో నిలిపిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని బీఆర్ఎస్ నాయకులు కొనియాడారు. కేసీఆర్ 72వ జన్మదిన వేడుకలు మంథని నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నాయకులు స్థానిక రాజగృహలో కేక్ కట్ చేసి సంబురాలు నిర్వహించుకున్నారు.ఈ సందర్భంగా కేసీఆర్ మద్ధతుగా నినాదాలు చేయడంతో పాటు ఆయన పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆనంతరం బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణను రంగాల్లో అభివృద్ధి చేసి భారతదేశానికి గర్వకారణంగా నిలిపిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. సాగు, తాగు నీటిని అందించడంతో పాటు హరితహారంతో తెలంగాణకు పచ్చటి చీర కట్టిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. రైతు బంధు, రైతు భరోసా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, వృద్ధులకు, వితంతువులు, ఒంటిరి మహిళలకు పెన్షన్లు, పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేలా గురుకులాల ఏర్పాటుతో ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలను చేపట్టి వాటిని వంద శాతం పూర్తి చేశారన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఎగోలపు శంకర్‌గౌడ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తగరం శంకర్‌లాల్, కౌన్సిలర్ మాచీడి రాజుగౌడ్, నాయకులు ఆరెపల్లి కుమార్, గొబ్బూరి వంశీ, వెల్పుల గట్టయ్య, మంథని విజయ్‌కుమార్, పిల్లి సత్యనారాయణ, ఆకుల రాజుబాబు, ఆసీఫ్, ఇర్ఫాన్లతో పాటు అధిక సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.