భవిష్యత్ మనదే.. గెలుపు కూడా మనదే
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు బీఫాంలు అందుకున్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి అధినేత కేసీఆర్ హాజరయ్యారు. రాష్ట్రంలో భవిష్యత్ బీఆర్ఎస్దేనని, రాబోయే ఎన్నికల్లో గెలుపు కూడా మనదేనని దిశానిర్దేశం చేశారు.
- అధినేత కేసీఆర్ దిశానిర్దేశం అభ్యర్థులకు బీ ఫాంలు
పెద్దపల్లి, ఏప్రిల్18(నమస్తే తెలంగాణ)/ కరీంనగర్ కార్పొరేషన్/ జగిత్యాల : బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు బీఫాంలు అందుకున్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి అధినేత కేసీఆర్ హాజరయ్యారు. రాష్ట్రంలో భవిష్యత్ బీఆర్ఎస్దేనని, రాబోయే ఎన్నికల్లో గెలుపు కూడా మనదేనని దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా అభ్యర్థులకు బీ ఫాంలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. గట్టిగా పోరాడితే మంచి ఫలితాలు వస్తాయని, మళ్లీ గులాబీ జెండా ఎగురుతుందని సూచించారు. మన ఉమ్మడి జిల్లా పరిధిలోని కరీంనగర్, పెద్దపల్లితోపాటు నిజమామాబాద్ లోక్సభ సెగ్మెంట్ అభ్యర్థులు బోయినపల్లి వినోద్ కుమార్, కొప్పుల ఈశ్వర్, బాజిరెడ్డి గోవర్ధన్ బీ ఫాంలు అందుకున్నారు. వారివెంట పార్లమెంట్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జడ్పీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

