బోయినపల్లి రూరల్/ ఇల్లంతకుంట/ చందుర్తి జూలై 25 : బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ స్మైల్ కార్యక్రమంలో భాగంగా బోయినపల్లి, ఇల్లంతకుంట, చందుర్తి మండలాల్లో బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం కేసీఆర్ కిట్లు పంపిణీ చేశారు. బోయినపల్లి మండలకేంద్రంలో పాటు తడగొండ, విలాసాగర్, రామన్నపేట, అనంతపల్లి, ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగాపూర్, చందుర్తి మండలంలోని నర్సింగాపూర్ గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి బాలింతలు, మహిళలకు అందజేశారు.
ఈ సందర్భంగా పలువురు మహిళలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ కిట్లు నిలిపివేసినా కేటీఆర్ కానుకగా అందజేయడం సంతోషంగా ఉందన్నారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు బైరగోని రమేశ్, మరాటి మల్లిక్, ముత్యాల నరేశ్, బండి శ్రావణ్, రాజశేఖర్, మల్లారెడ్డి, సాగర్, మధు, రాజు, దేవరాజు, గంగరాజు ఉన్నారు. ఇల్లంతకుంట నుంచి గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఒప్ప శ్రీనివాస్, మాతి రెడ్డి కిషన్ రెడ్డి, మీసరగండ్ల అనిల్, భాగయ్య, రమేశ్, సుధాకర్ రెడ్డి, ఎద్దు కుమార్, పసుల బాలరాజు ఉన్నారు. బోయినపల్లి నుంచి నాయకులు గుంటి శంకర్, చిందం రమేశ్, అంజనీరావు, రాములు, మల్లేశం, కమల్ గౌడ్, భీమనాథుని రమేశ్, సాగర్,బోయిని రాజు, సిద్దు,బుర్ర రాజు, తిరుపతిరెడ్డి, చందు, నాయకులు ఉన్నారు.