Katnapally | సుల్తానాబాద్ రూరల్, మార్చి23 : సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి శ్రీ రామేశ్వరాలయం శాశ్వత కమిటీ సభ్యులు సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ పాలకవర్గం ఏకగ్రీవంగా శాశ్వత కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.
శ్రీ రామేశ్వరాలయం చైర్మన్గా అడ్డగుంట రాజేందర్, వైస్ చైర్మన్ గా ధన్నమనేని కిషన్ రావు, ప్రధాన కార్యదర్శిగా కోరుట్ల కృష్ణాచారి, సహాయ కార్యదర్శిగా దాసరి రవి, కోశాధికారిగా కొల్లూరి శంకరయ్య ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా మోరపల్లి మోహన్ రెడ్డి, చిటి కేశవరావు, పాల రామారావు, మోరపల్లి తిరుపతిరెడ్డి (ఎంటీఆర్), ఉమ్మెంతల భాస్కర్ రెడ్డి, తూడి కనుకయ్య, దాసరి దేవేందర్, పొన్నాల మల్లయ్య, మేకల రాజయ్య, కోడూరు అంజయ్య, ఉండాటి రమేష్, వెయ్యిగండ్ల భూమయ్య వ్యవహరించనున్నారు. సర్పంచు ఓగుల పూజ రాజేందర్, ఉప సర్పంచ్ దాసరి రాజమల్లుతో పాటు పలువురు పాల్గొన్నారు.