Peddapally | సుల్తానాబాద్ రూరల్, జూలై 16 : నిరుపేద విద్యార్థినికి పై చదువుల కోసం ల్యాప్‌టాప్‌ను వితరణ చేసి తన ఔదార్యాన్ని చాటుకున్న మాజీ సర్పంచ్. పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మండలంలోని కాట్నపల్లి గ్రామానికి చెందిన మేకల ఓదెలు కూతురు బీటెక్ చదువుతుండగా ఆమెకు పైచదువుల కోసం ల్యాప్ టాప్ అవసరం ఉన్న విషయం తెలియడంతో వెంటనే స్పందించిన కాట్నపల్లి మాజీ సర్పంచ్ మోరపల్లి మోహన్ రెడ్డి దాదాపు రూ. 50 వేల విలువ చేసే ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేసి బీటెక్ విద్యార్థి పూజితకు బుధవారం తన నివాసంలో అందజేశారు. తనకు అండగా నిలబడిన మాజీ సర్పంచ్‌కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు.