National Level Volleyball Coach | ధర్మారం, జనవరి 2: హిమాచల్ ప్రదేశ్ లోని పాంటా సాహిబ్ లో జరిగే 9వ పాఠశాలల క్రీడా సమాఖ్య జాతీయ స్థాయి అండర్- 14 బాలుర వాలీబాల్ జట్టు కోచ్ గా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు తమ్మనవేణి కుమార్ ఎంపికయ్యారు.
ఈ మేరకు కుమార్ నియమించినట్లు తెలంగాణ స్కూల్ గేమ్స్ సెక్రటరీ ఉషారాణి, పెద్దపల్లి జిల్లా స్కూల్ గేమ్స్ సెక్రటరీ లక్ష్మణ్, జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా కుమార్ ఎంపిక పట్ల కటికేనపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పెద్ది వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.