ధర్మపురి, అక్టోబర్ 28: కార్తీక మాసం సందర్భంగా ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఆధ్వర్యంలో మూడో రోజు శుక్రవారం ఘనంగా గోదావరి హారతి కార్యక్రమం నిర్వహించారు. ఆలయం నుంచి సాయంత్రం మంగళవాయిద్యాలు, మహిళల కోలాటాల మధ్య వేద పండితులు, అర్చకులు గోదావరి నది వరకు శోభాయాత్రగా వెళ్లారు. అనంతరం వేద పండితులు బొజ్జ రమేశ్ శర్మ మంత్రోచ్ఛారణలతో గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం భక్తులు నదిలో కార్తీక దీపాలు వదిలారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, సూపరింటెండెంట్ ద్యావళ్ల కిరణ్‌కుమార్, రెనోవేషన్ కమిటీ సభ్యులు ఇందారపు రామన్న, ఇనుగంటి రమావెంకటేశ్వర్రావ్, గందె పద్మశ్రీనివాస్, చుక్క రవి, వేద పండితులు రమేశ్ శర్మ, ముత్యాల శర్మ, పాలెపు ప్రవీణ్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాస్ తదితరులున్నారు.