Karimnagar | కమానౌచౌరస్తా, సెప్టెంబర్ 12: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం హుండీలను లెక్కించగా, రూ.8.20 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో కందుల సుధాకర్ తెలిపారు.
దేవాదాయ శాఖ పరిధిలోని ఈ ఆలయంలో హుండీలను ఆరు నెలల 20 రోజులకు లెక్కించినట్ల ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో 8,20,327 ఆదాయం సమకూరిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు చకిలంశ్రీనివాస్, చకిలం గంగాధర్, దేవాదాయ శాఖ డివిజన్ ఇన్స్పెక్టర్ పి సత్యనారాయణ, సిబ్బంది శ్రీనివాస్, మహేందర్, అర్చకులు, గోవింద పతి సేవకులు పాల్గొన్నారు.