పట్టణాలు మెరుస్తున్నాయి. స్వచ్ఛతలో దూసుకెళ్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అవార్డుల పంట పండిస్తున్నాయి. అందులో భాగంగా గతేడాది సిరిసిల్ల పట్టణం ఓడీఎఫ్ ప్లస్ ప్లస్‌గా ఎంపికై సమర్థవంతంగా కొనసాగుతుండగా, ఈ యేడు బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత పట్టణాలుగా కరీంనగర్, కొత్తపల్లి, కోరుట్ల, పెద్దపల్లి ఎంపికయ్యాయి. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయా మున్సిపాలిటీల కమిషనర్లకు మంత్రి కేటీఆర్ ప్రశంసా పత్రాలు అందించారు. కీపిటప్ అంటూ అభినందించారు.
కలెక్టరేట్ /కొత్తపల్లి/ సిరిసిల్ల టౌన్/కోరుట్ల/ పెద్దపల్లి, జనవరి 5 : పట్టణాలు మెరుస్తున్నాయి. స్వచ్ఛతలో దూసుకెళ్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌లో అవార్డుల పంట పండిస్తున్నాయి. ఇందులో భాగంగా గతేడాది సిరిసిల్ల పట్టణం ఓడీఎఫ్ ప్లస్ ప్లస్‌గా ఎంపికై సమర్థవంతంగా కొనసాగుతుండగా, ఈ యేడు బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత పట్టణాలుగా కరీం‘నగరం’, కొత్తపల్లి, కోరుట్ల, పెద్దపల్లి బల్ది యాలు ఎంపికయ్యాయి. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయా మున్సిపాలిటీల కమిషనర్లకు మంత్రి కేటీఆర్ ప్రశంసా పత్రాలు అందించారు. కీపిటప్ అంటూ అభినందించారు.
కీపీటప్ సిరిసిల్ల బల్దియా
సిరిసిల్ల టౌన్, జనవరి 5: కేంద్ర ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న స్వచ్ఛ సర్వేక్షణ్‌లో భా గంగా బల్దియాలకు ఆయా విభాగాల్లో అవార్డులను అందజేస్తున్నది. బహిరంగ మల, మూత్ర విసర్జన, వందశాతం మరుగుదొడ్ల వినియోగంతో పాటు ఎస్టీపీ ప్లాంట్ నిర్వహణ విభాగాల్లో గతేడాది ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ అవార్డును సిరిసిల్ల బల్దియా దక్కించుకుంది. అప్పటి నుంచి ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ పట్టణంగా సమర్థవంతంగా కొనసాగుతున్నది. ఈ క్రమంలో గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ వెల్దండి సమ్మయ్యకు అప్రిసియేషన్ సర్టిఫికెట్(ప్రశంసాపత్రం)ను అందజేసి అభినందించారు. పనితీరును మ రింత మెరుగుపరుచుకొని 2023 అవార్డుల ఎంపికలోనూ సత్తాచాటాలని సూచించినట్లు కమిషనర్ పేర్కొన్నారు. ఇక్కడ అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, తదితరులున్నారు.
కరీం‘నగరానికి’ పురస్కారం
కలెక్టరేట్, జనవరి 5: ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ నగరంగా కరీంనగర్ బల్దియా ఎంపికైంది. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక సమావేశంలో మంత్రి కేటీఆర్ బల్దియా కమిషనర్ సేవా ఇస్లావత్ను అభినందిస్తూ, ప్రశంసాపత్రం అందజేశారు. నగరం ఎంపిక కావడంపై మేయర్ యా దగిరి సునీల్‌రావు, కార్పొరేటర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ స్ఫూర్తితో భవిష్యత్‌లో నగరా న్ని పారిశుధ్యంలో నెంబర్ వన్‌గా తీర్చిదిద్దేందుకు అవిరళంగా కృషి చేస్తామని చెప్పారు.
పెద్దపల్లి బల్దియాకు..
పెద్దపల్లి, జనవరి 5: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ అవార్డుల్లో పెద్దపల్లి బల్దియాకు చోటు దక్కింది. గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కుమార్, పెద్దపల్లి టౌన్ కమిషనర్ మట్ట శ్రీనివాస్‌రెడ్డి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. జిల్లాలో పెద్దపల్లి బల్దియాకు ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ రావడం ఆనందంగా ఉందని అదనపు కలెక్టర్ తెలిపారు.
కొత్తపల్లి పట్టణానికి ప్రశంస
కొత్తపల్లి, జనవరి 5: కరీంనగర్ శివారులోని కొత్తపల్లి మున్సిపాలిటీకి ఓడీఎఫ్ ప్లస్ ప్లస్‌కు ఎంపిక కాగా, గురువారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వేణుమాధవ్‌కు సర్టిఫికెట్‌ను మంత్రి కేటీఆర్ అందజేశారు. ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్న కమిషనర్‌ను చైర్మన్ రుద్ర రాజు, కౌన్సిలర్లు అభినందించారు.
కోరుట్ల మున్సిపాలిటీకి
కోరుట్ల, జనవరి 5: కోరుట్ల మున్సిపాలిటీకి ఓడీఎఫ్ ప్లస్ ప్లస్ (ఓపెన్ డెపికేషన్ ఫ్రీ ++) అవార్డు దక్కింది. స్వచ్ఛ సర్వేక్షన్లో భాగంగా కేంద్ర బృందాలు కొన్నేళ్లుగా మున్సిపాలిటీల్లో సర్వే చేసి బహిరంగ మల, మూత్ర రహిత పట్టణాలకు అవార్డులను ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కోరుట్ల మున్సిపాలిటీ ఓడీఎఫ్ ప్లస్ ప్లస్‌కు ఎంపికైంది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన కార్యక్రమంలో పురస్కారాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ చేతుల మీదుగా జగిత్యాల అదనపు కలెక్టర్ (ఎల్బీ) మకరంద, కోరుట్ల ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ మహేశ్ అందుకున్నారు.