రాంనగర్, మార్చి 16: మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమైతే జైలుకు పంపిస్తామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు అన్నారు. మద్యం తాగివాహనా లు నడపడంతో స్వయంగా ప్రమాదాలకు గురవడంతో పాటు ఇతరులను ఢీకొనడం ద్వారా అమాయకులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. మద్యం తాగి పట్టుబడిన వాహనదారులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కమిషనరేట్‌లోని ఓపెన్ థియేటర్లో గురువారం కౌన్సెలింగ్ ఇచ్చారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడా రు. మద్యం తాగి వాహనాలు నడపడం ద్వారా పలువురు వైకల్యానికి గురవుతున్నారని, మరికొందరు జీవచ్ఛవాలుగా మారి దుర్భర పరిస్థితులు ఎదురొంటున్నారని చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడిపి రెండోసారి పట్టుబడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతోపాటు లైసెన్సులు రద్దుచేసేందుకు సిఫారసు చేస్తామని హెచ్చరించారు. ర్యా, త్రిబుల్ రైడింగ్‌తో ఎకువశాతం రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆయన చెప్పారు.
మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు
మైనర్లకు వాహనాలిచ్చే తల్లిదండ్రులు, వాహనాల యజమానులపై కేసులు నమోదు చేస్తామని సీపీ స్పష్టం చేశారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే ముందు తల్లిదండ్రులు, వాహనదారులు ఆలోచించాలని సూచించారు. మైనర్లు ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్‌తో ప్రమాదాల బారిన పడుతున్నారని చెప్పారు. ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడేందుకు కారకులవుతున్న దుకాణాదాలపై కూడా కేసులు నమోదు చేస్తున్నామని వెల్లడించారు. దుకాణాదారులు ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా వినియోగదారులు పారింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పట్టుబడిన వారితో తాము మళ్లీ మద్యం తాగి వాహనాలు నడుపబోమని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు ఎస్ శ్రీనివాస్ (శాంతిభద్రతలు), జీ చంద్రమోహన్ (పరిపాలన), ఏసీపీ బీ విజయ్ కుమార్, ట్రాఫిక్ సీఐలు తిరుమల్, నాగార్జునరావు, సిబ్బంది పాల్గొన్నారు.