విద్యానగర్, జూన్ 13: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ గురువారం కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఉదయం 11గంటలకు ఢిల్లీ నార్త్ బ్లాక్‌లోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో హోం సహాయశాఖ అమాత్యుడిగా బాధ్యతలు తీసుకున్నారు.
సహచర మంత్రి నిత్యానందరాయ్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతి విద్యారణ్య భారతి హాజరై, ఆశీర్వదించారు. అంతకు ముందు తన అధికారిక నివాసంలో సంజయ్‌ను అభిమానులు, హైదరాబాద్, కరీంనగర్‌కు చెందిన బీజేపీ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.