ధర్మపురి, జూన్ 22: అర్హులైన మైనార్టీలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలని మైనారిటీ నాయకులను మంత్రి ఈశ్వర్ ఆదేశించారు. ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముస్లిం మైనారిటీ నాయకులతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ధర్మపురి నియోజకవర్గంలో ఇటీవల మజీదులు, ఈద్గాలు, ఖబ్రస్థాన్ల మరమ్మతు పనులకు రూ.4. 74కోట్లు మంజూరు చేయగా.. పనుల ప్రగతి గురించి నాయకులతో మాట్లాడారు. పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు షాదీ ముబారక్ పథకం అమలు చేస్తున్నామని, ఈ పథకం ప్రతీ పేద కుటుంబానికి వర్తించేలా చూడాలన్నారు. ప్రతిభావంతులైన మైనార్టీ విద్యార్థుల కోసం ఒవర్సీస్ స్కా లర్షిప్ పథకం అమలులో ఉందన్నారు.
ఈ పథకం ద్వారా ఒక్కొక్కరికీ రూ.20లక్షలు అందజేస్తున్నామన్నారు. తెలంగాణ మసీదుల్లో ప్రార్థనలు చేసే ఇమామ్, మౌజమ్‌లకు నెలకు రూ.1500 జీవన భృతి అందజేస్తున్నామన్నా రు. నిరుద్యోగ మైనారిటీ యువతకు సబ్సిడీ రు ణాలు అందజేస్తున్నామన్నారు. మైనార్టీల అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా డీసీఎమ్మెస్ చైర్మన్ డా.ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, జడ్పీటీసీ అరుణ, ఏఎంసీ చైర్మన్ అయ్యోరి రాజేశ్‌కుమార్, జగిత్యాల, పెద్దపెల్లి జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు అమ్జద్, సలామ్, జిల్లా వక్ఫ్‌బోర్డు సభ్యులు సయ్యద్ ఆసిఫ్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యులు ఎండీ. కైసర్, రియాజ్, రహమాన్, రహీం, రఫీ, రహీం, ధర్మపురి ము న్సిపల్ వార్డుసభ్యులు యూనుస్, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు అలీమ్, ఉజ్మాషబ్బీర్, ఏఎం సీ డైరెక్టర్ ఇక్రామ్, సలీమ్ తదితరులున్నారు. కాగా ధర్మపురి మండలం జైన గ్రామ సర్పంచ్ ప్రభాకర్రావ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా బుధవారం మంత్రి ఈశ్వర్ సర్పంచ్ కుటుంబసభ్యులను పరామర్శించారు.