రామగిరి, జూన్ 17 : సింగరేణి ఓసీపీ-2 విస్తరణలో భాగంగా ప్రభావిత లద్నాపూర్కు సంస్థ వల్ల నష్టం కలిగినట్లయితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని, నిబంధనల ప్రకారం లేకుంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని డీజీఎంఎస్ డిప్యూటీ డైరెక్టర్ బానోతు వెంకన్న తెలిపారు. లద్నాపూర్లో శుక్రవారం ఆయన వి చారణ చేపట్టారు. ఈ నెల 10వ తేదీన లద్నాపూ ర్ నిర్వాసితులు డీజీఎంఎస్కు ఫిర్యాదు చేయ గా, స్పందించిన ఆయన శుక్రవారం గ్రామానికి వచ్చి నిర్వాసితులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్వారీ వద్దకు వెళ్లి సర్వేయర్ల సహాయంతో క్వారీకి ఇండ్లకు దూరాన్ని కొలిపించారు.
ఓసీపీ-2 బేస్ వర్క్షాపు నుంచి ఇంటికి మధ్య 11 మీటర్లు, క్వారీ నుంచి ఇంటి వరకు కేవలం 28 మీటర్లు ఉందని గ్రామస్తులు వివరించారు. నష్ట పరిహారం చెల్లించకుండా సింగరేణి అధికారులు దౌర్జన్యం చేస్తూ ఇండ్లు కూల్చేస్తూ అక్రమంగా కేసులు పెడుతున్నారన్నారు. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే అర్ధరాత్రి పోలీసులను పురమాయించి అరెస్టులు చేయించారని పేర్కొన్నారు. అనంతరం 30 ఏండ్లుగా సింగరేణితో కాలుష్యం, జరుగుతున్న నష్టంపై వినతి పత్రం సమర్పించారు. ఇక్కడ సర్పంచ్ బడికెల విజయ శ్రీనివాస్, ఎంపీటీసీ ఉమ రాజయ్య, ఉపసర్పంచ్ మధునయ్య, మాజీ ఎంపీటీసీ వనం రాంచందర్ రావు నిర్వాసితులు ఉన్నారు.