కొత్తపల్లి, జూన్ 15: సైబర్ నేరాలపై విద్యార్థినులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత వెబ్సైట్ల నుంచి వచ్చే లింక్‌లను ఓపెన్ చేయవద్దని టౌన్ ఏసీపీ తుల శ్రీనివాసరావు సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కరాటే శిక్షణను బుధవారం ఆయన ప్రారంభించి, మాట్లాడారు. విద్యార్థినులు లక్ష్యాన్ని ఎంచుకొని ఆ దిశగా కృషి చేయాలని సూచించారు.
షీటీమ్, హాక్ఐ యాప్ సేవలను అత్యవసర సమయాల్లో సద్వినియోగం చేసుకోవాలన్నారు. కరాటేతో విద్యార్థినుల్లో ఆత్మైస్థెర్యం పెంపొందుతుందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. శ్రీ లక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్, షీటీమ్ సభ్యులు శ్రీలేఖ, స్వప్న, హెడ్‌కానిస్టేబుల్ పరశురాం, వైస్ ప్రిన్సిపాల్ సంపత్‌కుమార్, ఎన్ సంగీతారాణి, ఆర్ సునీత, రజినీ, శోభారాణి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీధర్‌రావు, చక్రవర్తి, సుజాత, శకుంతల, శ్వేత తదితరులు పాల్గొన్నారు.