కమాన్‌చౌరస్తా, జూన్ 15: విద్యార్థులు క్రమశిక్షణ, పట్టుదలతో చదివి భవిష్యత్‌కు బంగారు బాటలు వేసుకోవాలని శాతవాహన యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ మల్లేశ్ సంకశాల సూచించారు. జిల్లా కేంద్రంలోని వాణీనికేతన్ డిగ్రీ, పీజీ కళాశాల వార్షికోత్సవం బుధవారం నిర్వహించగా, ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఎంచుకొని ముందుకు సాగినప్పుడే ఉన్నత స్థాయికి చేరుతారని పేర్కొన్నారు.
కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ ఐ దీపిక మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన పలు సూచనలు ఇచ్చారు. అనంతరం పలు పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఎస్‌యూ రిజిస్ట్రార్ వరప్రసాద్, ఓఎస్డీ వీ రమేశ్, కళాశాల ప్రిన్సిపాల్ వేణుగోపాల్ రెడ్డి, బీఎడ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రశాంతరావు, అధ్యాపకులు పాల్గొన్నారు.