గంగాధర, జూన్ 15: ఉమ్మడి రాష్ట్రంలో ప్రాభవం కోల్పోయిన కుల సంఘాల బలోపేతానికి సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేస్తోందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని కురిక్యాలలో రూ.9.20 లక్షలతో నిర్మించిన నాయీబ్రాహ్మణ సంఘం, వెంకంపల్లిలో రూ.9.20 లక్షలతో నిర్మించిన యాదవ సంఘం భవనాలను బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలని, గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి సాధిస్తుందన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ పల్లెల ప్రగతికి కృషి చేస్తున్నారని చెప్పారు. ప్రతి గ్రామంలో కుల సంఘ భవనాల నిర్మాణం కోసం నిధులు కేటాయిస్తూ అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ పుల్కం నర్సయ్య, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పుల్కం గంగన్న, కురిక్యాల సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తిర్మల్‌రావు, వైస్ ఎంపీపీ కంకణాల రాజ్‌గోపాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ వేముల భాస్కర్, ఆత్మ చైర్మన్ తూం మల్లారెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, సర్పంచులు ముక్కెర మల్లేశం, వేముల దామోదర్, కంకణాల విజేందర్‌రెడ్డి, దోర్నాల హన్మంతరెడ్డి, రాసూరి మల్లేశం, ఆకుల శంకరయ్య, పొట్టల కనకయ్య, ఎంపీటీసీలు ముద్దం జమున, అట్ల రాజిరెడ్డి, ఆకుల శ్రీనివాస్, నాయకులు ముద్దం నగేశ్, బొల్లాడి శ్రీనివాస్‌రెడ్డి, అట్ల శేఖర్‌రెడ్డి, రామిడి సురేందర్, రేండ్ల శ్రీనివాస్, దోమకొండ మల్లయ్య, సముద్రాల అజయ్, బెజ్జెంకి కళ్యాణ్, గుండవేణి తిరుపతి, గంగాధర కుమార్, మామిడిపెల్లి అఖిల్, సముద్రాల ఓంకార్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.