జమ్మికుంట రూరల్, జూన్ 15: సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలు పంటలతో పచ్చగా మారాయని ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. జమ్మికుంట మండలం కోరపల్లి, బిజిగిరిషరీఫ్, విలాసాగర్, గండ్రపల్లి, వావిలాల, నాగారం, మడిపల్లి, అంకుషాపూర్ గ్రామాల్లో నిర్వహించిన ఐదో విడుత పల్లె ప్రగతి, ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాల్లో బుధవారం ఎమ్మెల్సీ పాల్గొన్నారు. ముందుగా ఆయా గ్రామాల్లో ఎమ్మెల్సీకి సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు డప్పుచప్పుళ్లతో ఘనంగా స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో సన్మానించారు.
అనంతరం గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు, అభివృద్ధి పనులను ఎమ్మెల్సీ ప్రారంభించారు. వేర్వేరుగా ఏర్పాటు చేసిన పల్లె ప్రగతి సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుతున్నదన్నారు. ఎమ్మెల్యే, మంత్రిగా పని చేసిన ఈటల రాజేందర్ నియోజకవర్గంలోని ఏ ఒక్క గ్రామంలోనైనా మహిళా సంఘ భవనం కట్టిండా? అని ప్రశ్నించారు. పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులతో గ్రామాల రూపురేఖలు మారాయన్నారు. ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు.
నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు. ఆయా కార్యక్రమాల్లో సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మాదిరెడ్డి వెంకట్‌రెడ్డి, వైస్ ఎంపీపీ పొల్సాని తిరుపతిరావు, కేడీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ పింగిళి రమేశ్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షురాలు కడవేర్గు మమత, సర్పంచులు గిరవేన రమారాజయ్య, రాచపల్లి సదయ్య, పింగిళి రమాదేవి, బల్మూరి పద్మాసమ్మారావు, జక్కెన శ్రీలతాసత్యనారాయణ, పోతరవేని రాజ్‌కుమార్, మూగల పరశురాములు, కడిపికొండ రాజిరెడ్డి, ఎంపీటీసీ తోట కవితాలక్ష్మణ్, మర్రి మల్లేశం, కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ రఫీ, పీఏసీఎస్ చైర్మన్ పొల్సాని వెంకటేశ్వర్రావు, జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సత్యనారాయణరావు, మాజీ కోఆప్షన్ సభ్యుడు సమీర్, తహసీల్దార్ రాజ్, ఎంపీవో సతీశ్‌కుమార్, ఎంఈవో శ్రీనివాస్‌తో పాటు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.