కరీంనగర్ రూరల్, జూన్ 15: కరీంనగర్ మండలం చామనపల్లి, జూబ్లీనగర్లో గొల్ల, కురుమల కుల దైవం బీరప్ప నాగవెళ్లి కల్యాణోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందు లో భాగంగా బుధవారం ఆయా గ్రామాల్లో ఉత్సవాలకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన సంస్కృతీసంప్రదాయాలు ఎంతో గొప్పవన్నారు. మహంకాళి, బీరప్ప, కామరాతి కల్యాణోత్సవాలను గ్రామాల్లో ఘనంగా నిర్వహించడం అనాదిగా వస్తున్న ఆచారమన్నారు.
మహంకాళి, బీరప్ప, కామరాతి దేవతల ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా చామనపల్లి సర్పంచ్ బొగొండ లక్ష్మీఐలయ్య మంత్రిని శాలువాతో సన్మానించారు. ఉత్సవాల్లో భాగంగా చామనపల్లి, జూబ్లీనగర్లో బీర్ల, ఒగ్గుపూజారులు దేవతా విగ్రహాలతో ఆలయం ముందు వేసిన అగ్నిగుండంలో నడిచారు. కల్యాణం నిర్వహించారు. బోనాలు సమర్పించారు. కార్యక్రమంలో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, సర్పంచులు బొగొండ లక్ష్మీఐలయ్య, రుద్ర భారతీరాములు, ఉపసర్పంచులు దావ నిర్మల, కుమార్, సుంకిశాల సంపత్రావు, కురుమ సంఘం నాయకులు బండారి ఐలయ్య, బొగొండ ఐలయ్య, బండారి లింగయ్య, కామండ్ల రాజయ్య, ఎల్లయ్య, సాయికృష్ణ, ఐలయ్య, రాజయ్య, శ్రీకాంత్, జూబ్లీనగర్లో కురుమ సంఘం నాయకులు పాయిల భూమయ్య, నిట్టు శ్రీనివాస్, కచ్చు వీరేశం, కచ్చు ఆశాలు, కచ్చు పరశురాములు కచ్చు కుమార్, ఎగుర్ల శ్రీకాంత్, కచ్చు అశోక్, సంఘ సభ్యులు పాల్గొన్నారు.