చిగురుమామిడి, జూన్ 15: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి నీటి పారుదల ప్రాజెక్ట్‌ను వెంటనే ప్రారంభించి కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని అన్ని గ్రామాలకు గోదావరి జలాలు అందేలా చూడాలని మండలంలోని రైతులు ఐక్య వేదికగా ఏర్పడి చిగురుమామిడిలోని బస్టాండ్ ఆవరణలో బుధవారం దీక్ష నిర్వహించారు. రైతు ఐక్య వేదిక అధ్యక్షుడు పన్యాల భూపతిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షకు ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్రెడ్డి, టీఆర్ఎస్ మండల నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో హుస్నాబాద్ నియోజకవర్గం మెట్టప్రాంతం కావడంతో నీరు లేక పంటలు పండించలేని దుస్థితి ఏర్పడిందన్నారు.
గత ప్రభుత్వాలు గౌరవెల్లి ప్రాజెక్టును నియోజకవర్గంలోని మండలాల రైతులకు ఉపయోగపడకుండా డిజైన్ చేస్తే ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ చొరవతో ముఖ్యమంత్రి కేసీఆర్ రీ-డిజైన్ చేసి నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలకు గోదావరి నీటిని చేరవేసే విధంగా నిర్మాణం పూర్తి చేశారని గుర్తు చేశారు. దాని ట్రయిల్న్క్రు అవాంతరాలు సృష్టిస్తున్న ప్రతిపక్ష నాయకులు ఇకనైనా కపట బుద్ధి మానుకోవాలని హితవుపలికారు. వెంటనే గౌరవెల్లి ప్రాజెక్ట్‌ను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, రైతు బంధు జిల్లా సమితి నాయకులు సాంబారి కొమురయ్య, మారెట్ కమిటీ వైస్ చైర్పర్సన్ కొమ్మెర మంజుల, సర్పంచ్ బెజ్జంకి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.