బోయినపల్లి, జూన్ 14: క్రమశిక్షణతోపాటు చక్కని విద్యకు మారుపేరు బోయినపల్లి మండలం నర్సింగాపూర్ సర్కారు బడి అని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ఈ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేరని నర్సింగాపూర్ సర్పంచ్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జోగినపల్లి ప్రేమ్ సాగర్‌రావు మంగళవారం వినోద్‌కుమార్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించారు. బుధవారం పాఠశాలను సందర్శించారు. డీఈవో రాధాకిషన్, జడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డిని సిరిసిల్ల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, టీచర్ల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడారు. సిరిసిల్ల జిల్లాలో 339 ప్ర భుత్వ ప్రాథమిక, 111 జడ్పీ పాఠశాలలు ఉన్నాయని, 120 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. అయితే, జడ్పీ సెకండరీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండి, ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న పాఠశాలలు కూడా ఉన్నాయని తెలిపారు. అందుకు ఉదాహరణ బో యినపల్లి మండలం స్తంభంపల్లి జడ్పీ పాఠశాల అని, అక్కడ 33 మంది విద్యార్థులకు 8 మంది టీచర్లున్నారని, మాన్వాడ జడ్పీ పాఠశాలలో 18 మంది విద్యార్థులకు గాను ఆరుగురు, మల్లాపూర్ పాఠశాలలో 20 మంది విద్యార్థులకు ఆరుగురు టీచర్లు ఉన్నారని చెప్పారు.
రేషనలైజేషన్ అనేది పెద్ద సమస్య అని, రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాల, రాజకీయ పార్టీల నాయకులు సమష్టిగా కూర్చుని మాట్లాడితే ఇది పరిష్కారమవుతుందని చెప్పారు. సర్కారు ‘మన ఊరు -మన బడి’ కింద పాఠశాలలకు పూర్వ వైభవం తెస్తున్నదని చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు ఆదరణ పెరుగుతున్నదని తెలిపారు. అలాగే ఒకటి నుంచి 8వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల బోధన జరుగుతున్నదని, మన విద్యార్థుల భవిష్యత్‌తోపాటు ప్రభుత్వ పాఠశాలల మనుగడ కు ఉపాధ్యాయ సంఘాల, రాజకీయ పార్టీల నా యకులు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కాగా, నర్సింగాపూర్ స్కూల్‌కు ప్ర త్యేక చరిత్ర ఉన్నదని, ఇక్కడ చదివిన ఎంతో మం దిని మేధావులుగా తయారు చేసిందని, చాలా మంది రాజకీయ నాయకులు, న్యా యవాదులు, డాక్టర్లు, ఇంజనీర్లుగా పని చేస్తున్నారని చెప్పారు. త్వరలోనే పాఠశాలకు పూర్వవైభ వం వస్తుందని, ప్రభుత్వం సమూల మార్పు లు తీసుకువస్తున్నదని వివరించారు. విద్యార్థులకు సరిపడా టీచర్లు కూడా వస్తారని చెప్పారు. చెరువుకు మరమ్మతు చేయించాలని, మధ్యమానేరు నుంచి నర్సింగాపూర్ వచ్చే ఎడమ కాలువ పూడికతీయించాలని వినోద్‌కుమార్‌ను మత్స్యకారు లు, రైతులు కోరగా వెంటనే స్పందించారు. సం బంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పారు. ఇక్కడ ఎంపీపీ పర్లప ల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్తెరపాక ఉమా కొండయ్య, వైస్ ఎంపీపీ కొనుకటి నాగయ్య, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కత్తెరపాక కొండయ్య ఉన్నారు.