విద్యానగర్, జూన్ 8: బ్రెయిన్ ట్యూమర్‌ను తొలి దశలో గుర్తిస్తేనే ఫలితం ఉంటుందని, సర్జరీ చేసి ప్రాణాలను కాపాడే అవకాశం దొరుకుతుందని న్యూరోసర్జన్ డాక్టర్ శ్వేత స్పష్టం చేశారు. ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మెడికవర్ దవాఖానలో బుధవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. ట్యూమర్ రాకుండా ఆప డం, వచ్చే అవకాశాలను ముందే తెలుసుకోవడం సాధ్యం కా దన్నారు. లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవడం వల్ల తొలి దశలోనే గుర్తించవచ్చని తెలిపారు.
జెనటిక్ సమ స్య, మెదడుపై అధిక ఒత్తిడి, రేడియేషన్, ప్రమాదాల్లో తలపై గాయాల అనంతరం కూడా ట్యూమర్ వచ్చే ప్రమాదముందన్నారు. ఫిట్స్, మూతి వంకర, కంటిచూపు తగ్గడం, నోటి ద్వారా మింగలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ట్యూమర్‌గా అనుమానించాల్సిందేనని తెలిపారు.
ట్యూమర్ సర్జరీల్లో అత్యంత ఆ ధునికమైన పరికరాలు అం దుబాటులోకి వచ్చాయని, భ యపడాల్సిన పనిలేదన్నారు. బినైన్ ట్యూమర్స్‌తో ఎలాం టి ప్రాణాపాయం ఉండదని, కేవలం క్యాన్సర్ కారక ట్యూమర్లతోనే లైఫ్ రిస్ ఉంటుందని తెలిపారు. ఇటీవల పిల్లల్లో వచ్చే ట్యూమర్లు సైతం హైగ్రేడ్గా ఉంటున్నాయన్నారు. భయపడకుండా వైద్యం చేయించుకుంటే ప్రాణాపాయం తప్పుతుందన్నారు. పిల్లలను లేట్ నైట్ టీవీలు చూడకుండా కట్టడి చేయడం, సెల్ ఫోన్లకు దూరంగా ఉం చడం వంటివి చేస్తే రేడియేషన్ ప్రభా వం, మెదడుపై ఒత్తి డి తగ్గుతుందన్నారు. పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ సదస్సులో పేషెంట్లతో పాటు దవాఖాన అడ్మినిస్ట్రేటర్ గుర్రం కిరణ్, వైద్యులు పాల్గొన్నారు.