కరీంనగర్, జూన్ 8 (నమస్తే తెలంగాణ) : పల్లె, పట్టణ ప్రగతి ఉత్సాహంగా కొనసాగుతున్నది. ఆరో రోజు బుధవారం ఉమ్మడి జిల్లాలో ప్రజలంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. వర్షాకాలం ఆరంభమవుతున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు రాకుండా వీధులు, మురికి కాలువలను శుభ్రం చేస్తున్నారు. ఖాళీ ప్రదేశాలలో నీటి నిల్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నగరంలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్వహణను మేయర్ సునీల్‌రావు పరిశీలించారు.
హుజూరాబాద్ పట్టణంలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ పాల్గొన్నారు. స్థానిక క్రీడా మైదానాన్ని సందర్శించారు. ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లను, సులభ్ కాంప్లెక్స్‌లను పరిశీలించారు. గంగాధర మం డలంలోని పలు గ్రామాల్లో మరుగుదొడ్ల వినియోగంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీలు నిర్వహించారు. చొప్పదండి ని యోజకవర్గం కొడిమ్యాల మండలం పూడూరులో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చెత ్తను ఎత్తి శుభ్రం చేశారు. దళిత వాడలో డ్రైనేజీలను శుభ్రం చేశారు. ప్రధాన వీధుల్లో రహదారులను పరిశీలించారు.