మణుగూరు టౌన్, జూన్ 5: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దాల్వియా పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మణుగూరు అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ప్రదర్శన నిర్వహించి, అనంతరం మానవహారం ఏర్పాటు చేశారు. సింగరేణి పీకే వోసీలో సింగరేణి అధికారులు మాలోత్ రాముడు, దండమూడి రాంబాబు, సింగరేణి గుర్తింపు సంఘం ఉపాధ్యక్షుడు వీ ప్రభాకర్, ఎఫ్ఎస్వో సాలుజా, పర్యావరణ పరిరక్షణ ప్రేమికుడు చంద్రశేఖర్, ఉద్యోగులు పాల్గొన్నారు.
సారపాక, జూన్ 5: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఐటీసీ రోటరీ క్లబ్ ఇన్ భద్ర అధ్యక్ష, కార్యదర్శులు హరినారాయణ్, షేక్ బాషా అన్నారు. ఆదివారం సారపాకలోని పల్లెప్రకృతివనం వద్ద పర్యావరణ దినోత్సవం సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి మాట్లాడారు. మొక్కలతోనే జీవ వైవిధ్యం పెంపొందుతుందన్నారు. కార్యక్రమంలో ఐటీసీ ఉన్నతాధికారులు బసప్ప ఘోష్, టీఎస్ భాస్కర్, శ్యామ్కిరణ్, చెంగల్రావు, సాయిరాం, డీవీఎం నాయుడు, నదియా, సారపాక ఈవో కంది మహేశ్, టీఎన్టీయూసీ బాధ్యులు గల్లా నాగభూషయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, ఐటీసీ కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు పాకాల దుర్గాప్రసాద్, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
అశ్వాపురం, జూన్ 5: మల్లెలమడుగు పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ కోడి కృష్ణవేణి, కార్యదర్శి బిందు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని అన్నారు. వార్డు సభ్యురాలు దుర్గ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.