తెలంగాణలోని ప్రతిగ్రామాన్ని అన్నివిధాల అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ‘పల్లెప్రగతి’కి శ్రీకారం చుట్టారు. నాలుగు విడుతలుగా చేపట్టిన ఈ కార్యక్రమ ఫలితాలు కండ్ల ముందే కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ప్రాణాంతకంగా మారిన మలేరియా, డెంగ్యూలాంటి వ్యాధులు ఇప్పుడు కనుమరుగయ్యాయి. గ్రామీణ క్రీడలకు పూర్వవైభవాన్ని తెచ్చే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న క్రీడాప్రాంగణాలను యువకులు వినియోగించుకోవాలి. ఆటల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయస్థాయిల్లో పతకాలు సాధించాలి.
– కురిక్యాలలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్
గంగాధర, జూన్ 4: గ్రామాల సమగ్రాభివృద్ధికే సీఎం కేసీఆర్ పల్లె ప్రగతికి అంకురార్పణ చేశారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ ఉద్ఘాటించారు. నాలుగు విడుతల్లో చేపట్టిన కార్యక్రమాల ఫలితాలు మన కండ్ల ముందే కనిపిస్తున్నాయని చెప్పారు. ఈ మహత్తర యజ్ఞంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చా రు. శనివారం ఆయన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌తో కలిసి గంగాధర మండలంలో పర్యటించారు. 52 లక్షలతో నిర్మించే గంగాధర సహకార సంఘ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం కురిక్యాలలో నిర్వహించిన పల్లెప్రగతిలో పాల్గొని క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ తరగతులను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయాచోట్ల ఆయన మాట్లాడారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కృషితో సమూల మార్పులు వచ్చాయని, పల్లె ప్రగతితో సీజనల్ వ్యాధులు కనుమరుగయ్యాయని చెప్పారు. క్రీడా ప్రాంగణాలను యువకులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం లక్ష ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వనున్నదని, నిరుద్యోగులు కష్టపడి కొలువులు సాధించాలని ఆకాంక్షించారు. సహకార సంఘాల బలోపేతానికి సీఎం కృషి చేస్తున్నారని చెప్పారు. ఎమ్మెల్యే సుంకె మాట్లాడు తూ ఎంపీ బండి సంజయ్ నియోజకవర్గానికి చేసిందేమీలేదని విమర్శించారు. ఎంపీగా ఉన్న ప్పుడు వినోద్ తెచ్చిన ప్రాజెక్టులను సైతం కొనసాగించలేని అసమర్థుడని ధ్వజమెత్తారు.
కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, డీసీఎమ్మెస్ డైరెక్టర్ వీర్ల వెంకటేశ్వర్రావు, జడ్పీటీసీ పుల్కం అనురాధ, ఏఎంసీ చైర్మన్ సాగి మహిపాల్‌రావు, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ పుల్కం గంగన్న, కొండగట్టు ఆలయ డైరెక్టర్ పుల్కం నర్సయ్య, విండో చైర్మన్లు వెలిచాల తిరుమల్‌రావు, వైస్ ఎంపీపీ కంకణాల రాజ్‌గోపాల్‌రెడ్డి, వైస్ చైర్మన్ వేముల భాస్కర్, సర్పంచులు మేచినేని నవీన్‌రావు, మడ్లపెల్లి గంగాధర్, ఎండీ నజీర్, వేముల దామోదర్, కంకణాల విజేందర్‌రెడ్డి, ఆకుల శంకరయ్య, రాజూరి మల్లేశం, జోగు లక్ష్మిరాజం, మాల చంద్ర య్య, ఎంపీటీసీలు అట్ల రాజిరెడ్డి, ద్యావ మధుసూదన్‌రెడ్డి, నాయకులు అలువాల తిరుపతి, వేముల అంజి, రేండ్ల శ్రీనివాస్, రామిడి సురేందర్, తోట మహిపాల్, తాళ్ల సురేశ్, బొల్లాడి శ్రీనివాస్‌రెడ్డి, సుంకె అనిల్, పెంచాల చందు, మ్యాక వినోద్, మామిడిపెల్లి అఖిల్, గుండవేని తిరుపతి పాల్గొన్నారు.