కమాన్‌చౌరస్తా, జూన్ 4: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురసరించుకొని స్థానిక ఎస్సారార్ కళాశాల ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం ‘మట్టిని రక్షించు’ అంశంపై అవగాహన కార్యక్రమా న్ని నిర్వహించారు. ముఖ్య వక్తగా ఫౌండేషన్ యువ వలంటీర్ దినీత్రెడ్డి హాజరై వలంటీర్లందరికీ భూసారాన్ని సంరక్షించడంపై అవగాహన కల్పించారు.
అనంతరం సద్గురువు ప్రపంచ వ్యాప్తంగా చేపడుతున్న ఉద్యమ కార్యక్రమానికి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల కిలోమీటర్లు సైక్లింగ్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నందుకు 15 ఏండ్ల బీ వెన్నెలను కళాశాల ఆధ్వర్యంలో సన్మానించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కే రామకృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి సమన్వయకర్తగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ వీ వరప్రసాద్ వ్యవహరించారు. వివిధ ఎన్ఎస్ఎస్ యూనిట్ల ప్రోగ్రాం అధికారులు ఎ.నారాయణ, బీ సురేశ్‌కుమార్, డీడీ నాయు డు, ఎన్సీసీ లెఫ్టినెంట్ రాజు, అధ్యాపకులు, ఈషా ఫౌండేషన్ సభ్యులు ప్రియాంక, కుమార్, నాయకి, నాగరాజు పాల్గొన్నారు.