సిరిసిల్ల/కలెక్టరేట్/సిరిసిల్లటౌన్ జూన్, 2: ఒకప్పటి కరువు జిల్లా సిరిసిల్ల స్వరాష్ట్రంలో ప్ర గతిలో దూసుకెళ్తున్నదని, అభివృద్ధికి చిరునామాగా దేశానికి, రాష్ర్టానికి ఆదర్శంగా నిలుస్తున్నదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు. గురువారం రాష్ట్ర అవతరణ ది నోత్సవాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్లో జెండా ఆవిష్కరించారు. ఈ ఎనిమిదేండ్లలో జిల్లా సాధించిన ప్రగతిని వివరించారు. ఆయన మాటల్లోనే..
పండుగలా వ్యవసాయం..
రైతును రాజుగా చూడాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పం. ఆ ఉద్దేశ్యంతోనే దేశంలో ఎక్క డా లేనివిధంగా రైతుబంధు పథకాన్ని 2018 లో అమల్లోకి తేగా, ఒక్క రాజన్నసిరిసిల్ల జిల్లాలోనే ఇప్పటి వరకు 2 లక్షల 39 వేల 491 మంది రైతులకు రూ.945 కోట్లు పెట్టుబడి సాయం అందించాం. రైతులకు సుస్థిర ఆదా యం రావాలి, మెరుగ్గా బతకాలి అనే ఉద్దేశం తో తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగును ప్రో త్సహిస్తున్నాం. ఇందుకు రాష్ట్ర బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించాం. జిల్లాలో ఈ యేడు 1600 ఎకరాల్లో ఆయిల్‌పామ్ మొక్క లు నాటేందుకు కార్యాచరణ సిద్ధం చేశాం.
మెట్ట ప్రాంతంలో జలసిరులు..
తెలంగాణ వరదాయినీ కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీరాజరాజేశ్వర జలాశయం నీటి జంక్షన్‌లా మారింది. ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నది. కాళేశ్వరంలో భాగంగా రూ.1627 కోట్లతో చేపడుతున్న ప్యాకేజీ 9 పనుల ద్వారా ఎగువ మానేరు ప్రాజెక్టు వరకు 11.6 టీఎంసీల నీటిని ఎత్తిపోసి వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లోని 86,150 ఎకరాల ఆయకట్టుకు అందించబోతున్నాం. జిల్లాలో మైనర్, మీడియం ఇరిగేషన్ ద్వారా 57,146 ఎకరాలు, కాళేశ్వరం ప్రాజెక్టు 9,10,11,12 ప్యా కేజీల ద్వారా 1,39,246 ఎకరాలు, శ్రీపాద ఎల్లంపల్లి, మధ్యమానేరు ద్వారా 55,980 ఎకరాలకు మొత్తం 2,52,372 ఎకరాలకు సాగు నీరు అందబోతున్నది.
మధ్యమానేరులో అతిపెద్ద ఆక్వాహబ్..
చేప పిల్లల ఉచిత పంపిణీతో మత్స్య రం గం దశదిశలు మార్చిన ప్రభుత్వం, మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నది. శ్రీరాజరాజేశ్వర జలాశయం కేంద్రంగా రూ.2వేల కోట్ల భారీ పెట్టుబడితో 10 వేల మందికి ఉపాధినిచ్చేలా 500 ఎకరాల విస్తీర్ణంలో అతిపెద్ద ఆక్వా హబ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. అమెరికాకు చెందిన ఫిషిన్ సంస్థతో ఒప్పందమైంది. ఫ్రెష్ టూ హోమ్, ఆనందా గ్రూప్, సీపీ ఆక్వా గ్రూప్ సంస్థలు ఈ ఆక్వా హబ్‌లో పెట్టుబడులు పెడుతున్నాయి.
పెండ్లి చేసి, ఇల్లు కట్టిస్తున్న ఘనత కేసీఆర్‌దే
పేదింటి ఆడపిల్ల పెండ్లి భారం తీర్చేందుకు ‘కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్’, పేదలు ఆత్మగౌరవంగా బతికేందుకు డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టించి ఇస్తున్న ఘనత కేసీఆర్‌కే దక్కుతుంది. జిల్లాకు 6,886 ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయగా, ఇప్పటివరకు 3,402 ఇం డ్లు నిర్మించాం. జిల్లా ఇప్పటి వరకు కల్యాణలక్ష్మి కింద 17,575 మందికి రూ.154.42 కోట్లు, షాదీముబారక్ ద్వారా 755 మందికి రూ.6.40 కోట్లు ఆర్థిక సాయం అందజేశాం.
అంతర్జాతీయ ప్రమాణాలతో డ్రైవింగ్ శిక్షణ
తెలంగాణలో ఎక్కడా లేని విధంగా ప్రభు త్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రూ.16.48 కోట్లతో మండెపల్లిలో నిర్మించిన ఐడీటీఆర్‌లో అంతర్జాతీయ ప్రమాణాలు, సూపర్ టెక్నాలజీతో యువతకు ట్రైనింగ్ ఇస్తున్నాం. 317 మ ంది అభ్యర్థులు ప్రవేశాలు పొందగా 89 మం దికి ప్లేస్మెంట్ కల్పించినట్లు మంత్రి చెప్పారు.