కార్పొరేషన్, జూన్ 2: జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, వివిధ పార్టీలు, యువజన సంఘాల కార్యాలయాలు, ప్రభుత్వ ప్రధాన దవాఖాన, కోర్టు ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించారు. నగరంలోని తీగలగుట్టపల్లిలో గల కేసీఆర్ భవన్లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సాధన కోసం పోరాటం చేసిన నాయకుడే పాలకుడు కావడంతో అన్ని రంగాల్లో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, నాయకులు కలర్ సత్తన్న, పెండ్యాల మహేశ్ తదితరులు పాల్గొన్నారు. బల్దియా కార్యాలయంలో మేయర్ వై సునీల్‌రావు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నగరంలో మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజలకు అందించేందుకు పాలకవర్గం కృషి చేస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, పాలకవర్గ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. 33వ డివిజన్లోని క్యాంపు కార్యాలయంలో మేయర్ వై సునీల్‌రావు జాతీయ జెండా ఆవిష్కరించి, స్వీట్లు పంచిపెట్టారు. క్యాంపు కార్యాలయ సిబ్బంది అంజన్‌రావు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మంత్రి మీ సేవ కార్యాలయం వద్ద టీఆర్ఎస్ నాయకుడు మేచినేని అశోక్‌రావు, 59వ డివిజన్ కార్యాలయంలో కార్పొరేటర్ గందె మాధవి జాతీయ జెండా ఆవిష్కరించారు. డివిజన్ పెద్దలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
రేకుర్తిలోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్ మాస మౌనిక సోనీ జాతీయ జెండా ఆవిషరించగా, ఆర్ఎల్సీ అంబేదర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. నగరంలోని గాంధీచౌక్, కార్ఖానాగడ్డలో కంసాల శ్రీనన్న యువసేన ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 3వ డివిజన్ కార్పొరేటర్ కంసాల శ్రీనివాస్ అంతకు ముందు తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో యువసేన అధ్యక్షుడు సంపతి అశోక్, ప్రధాన కార్యదర్శి గడ్డం వీరేందర్, సభ్యులు దరిపెల్లి క్రాంతి, కోటేశ్వర్, పవన్, పెండ్యాల మహేశ్, దొమ్మటి శంకర్, కెముసారం తిరుపతి తదితరులు పాల్గొన్నారు. సుడా కార్యాలయంలో చైర్మన్ జీవీ రామకృష్ణారావు జాతీయ జెండా ఆవిష్కరించారు. జడ్పీ చైర్పర్సన్ విజయ, సభ్యులు మధు, రవి, మారుతి పాల్గొన్నారు.
కలెక్టరేట్, జూన్ 2: కలెక్టరేట్లో కలెక్టర్ ఆర్వీ కర్ణన్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి, జాతీయ జెండా ఆవిష్కరించారు. క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్ జాతీయ జెండా ఎగురవేశారు. అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, కలెక్టరేట్ ఏవో లక్ష్మారెడ్డి, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మారం జగదీశ్వర్, దారం శ్రీనివాస్‌రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జడ్పీ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ జాతీయ జెండా ఆవిష్కరించారు. ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఎదుట అధ్యక్షుడు పెండ్యాల కేశవరెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. కార్యదర్శి ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. కశ్మీర్‌గడ్డలోని ముస్లిం యూత్ లీగ్ సంఘం జిల్లా కార్యాలయం ఎదుట జాతీయ జెండా ఆవిష్కరించారు. అధ్యక్షుడు మహ్మద్ ఇర్ఫాన్, సభ్యులు రవూఫ్, సిద్దిఖీ, సాదీక్, తబస్సుం పాల్గొన్నారు.
కొత్తపల్లి, జూన్ 2: జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ పిల్లి శ్రీలత-మహేశ్‌గౌడ్, కొత్తపల్లి మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ రుద్ర రాజు జాతీయ జెండా ఆవిష్కరించారు. కొత్తపల్లి పట్టణంలోని 7వ వార్డులో వాలీబాల్ కోర్టు, రాణిపూర్‌లో ఖోఖో కోర్టును మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో గ్రంథాలయ కార్యదర్శి శ్రీలత, ఎంపీటీసీ తిరుపతినాయక్, గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీవో శ్రీనివాస్, ఏఈ అంజయ్య, ఏపీవో స్పందన, జూనియర్ అసిస్టెంట్ ఆరీఫ్, టీఏ వెంకటరమణ, సీవోలు రజినీ, మమత, కౌన్సిలర్లు వాసాల రమేశ్, మానుపాటి వేణుగోపాల్, గున్నాల విజయ, ఎస్కే నజీయ, గండు రాంబాబు, చింతల సత్యనారాయణరెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు చెట్టిపెల్లి ప్రభాకర్, ఎండీ ఫక్రొద్దీన్, ఎస్కే షహనాజ్, నాయకులు బండ గోపాల్‌రెడ్డి, ఎస్కే బాబా, గున్నాల రమేశ్, జెర్రిపోతుల శ్రీకాంత్, సుధాకర్ పాల్గొన్నారు. కరీంనగర్‌లోని మానేరు పాఠశాలలో విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణారెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కమాన్‌చౌరస్తా, జూన్ 2: శాతవాహన విశ్వవిద్యాలయంలో వీసీ ప్రొఫెసర్ మల్లేశ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వరప్రసాద్, ప్రధానాచార్యులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. వాణీనికేతన్ డిగ్రీ, పీజీ కళాశాలలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. కళాశాల కరస్పాండెంట్ ఐ దీపిక, ప్రిన్సిపాల్ వేణుగోపాల్ రెడ్డి, ప్రశాంత్ రావు, శ్రీనివాస్ రెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు. పారమిత విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో విద్యాసంస్థల చైర్మన్ ప్రసాద్ రావు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఇక్కడ డైరెక్టర్లు ప్రసూన, రశ్మిత, వినోద్‌రావు, రాకేశ్, అనుకర్ రావు, వీయూఎం ప్రసాద్, హన్మంతరావు పాల్గొన్నారు. 8వ డివిజన్ (అల్గునూర్) కార్యాలయంలో కార్పొరేటర్ సల్ల శారద-రవీందర్ జాతీయ జెండా ఎగురవేశారు. టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు జాప శ్రీనివాస్ రెడ్డి, రాఘవరెడ్డి, పరశురాములు, రాంచంద్రారెడ్డి, జాప లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణచౌక్, జూన్ 2: నగరంలో కుల, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ కార్యాలయంలో కుల సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు జీఎస్ ఆనంద్ జాతీయ జెండా ఆవిష్కరించారు. నాయకులు గౌస్‌పాషా, నర్సయ్య, సంజీవరావు, రవీందర్, శ్రీనివాస్, కొమురయ్య పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద సీపీఐ జిల్లా కార్యదర్శి పొనగంటి కేదారి ఆధ్వర్యంలో నాయకులు పూలమాలలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జిల్లా కార్యాలయంలో జెండా ఎగురవేశారు. నాయకులు కొయ్యడ సృజన్, సురేందర్‌రెడ్డి, మణికంఠరెడ్డి, సదాశివ, అంజలి, శోభన, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు. ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఈడీ వెంకటేశ్వర్లు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆర్ఎం ఖుస్రోషాఖాన్, జోనల్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి రవీందర్, డీవీఎం కవిత, కార్గో అధికారి సురేశ్ చౌహాన్ పాల్గొన్నారు. ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు నగరంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు.
ముకరంపుర, జూన్ 2: విద్యుత్ శాఖ కరీంనగర్ సర్కిల్ కార్యాలయంలో ఎస్ఈ గంగాధర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సర్కిల్ పరిధిలో విధి నిర్వహణలో ఉత్తమ సేవలందించిన 65 మందికి ప్రశంసా పత్రాలు అందజేసి, అభినందించారు. టీఆర్వీకేఎస్ కార్యాలయంలో అధ్యక్షుడు గుగులోత్ రాందాస్ నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, కేక్ కట్ చేశారు. నాయకులు మునీందర్, రవీందర్, ప్రసాద్, జమ్ములాల్, ప్రవీణ్, శ్రీహరి పాల్గొన్నారు. అటవీశాఖ కార్యాలయంలో సీఎఫ్‌వో సైదులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. డీఎఫ్‌వో బాలామణి, ఎఫ్‌డీవో వెంకన్న, ఎఫ్ఆర్వోలు గంటల శ్రీనివాస్‌రెడ్డి, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
కరీంనగర్ రూరల్, జూన్ 2: కరీంనగర్ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య జాతీయ జెండా ఎగురవేశారు. కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. వైస్ ఎంపీపీ వేల్పుల నారాయణ, ఎంపీటీసీ వినయ్‌సాగర్, ఇన్చార్జి ఎంపీడీవో సంపత్‌కుమార్, ఏఈ రమణారెడ్డి పాల్గొన్నారు. కరీంనగర్ సింగిల్ విండో కార్యాలయంలో సింగిల్ విండో చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. వైస్ చైర్మన్ బీరం ఆంజనేయులు, డైరెక్టర్లు గంట శంకరయ్య, సాయిల మహేందర్, బోనాల నర్సయ్య, సీఈవో రమేశ్ పాల్గొన్నారు. దుర్శేడ్ సింగిల్ విండో కార్యాలయంలో సింగిల్ విండో చైర్మన్ బల్మూరి ఆనందరావు జాతీయ జెండా ఎగురవేశారు. వైస్ చైర్మన్ నర్సయ్య, డైరెక్టర్ గాజుల అంజయ్య, తోట తిరుపతి, బిజిలి పోచయ్య, వేల్పుల రమేశ్, కుంభ శ్రీనివాస్ రెడ్డి, దాడి లచ్చయ్య పాల్గొన్నారు. బొమ్మకల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ జాతీయ జెండా ఎగురవేశారు. వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ గ్రామాధ్యక్షుడు జోజిరెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేశారు. ఆంజనేయులు, ఎంపీటీసీ వెంగళదాసు శ్రీనివాస్, కాల్వ మల్లేశంయాదవ్, కార్యదర్శి శ్రీనివాస్, ఉపసర్పంచ్ మాచర్ల సత్యనారాయణ, భాస్కర్‌రెడ్డి, శంకర్ పాల్గొన్నారు. గోపాల్పూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఊరడి మంజుల, దుర్శేడ్‌లో సర్పంచ్ గాజుల లక్ష్మి, చేగుర్తిలో సర్పంచ్ చామనపల్లి అరుణ, మొగ్దుంపూర్లో సర్పంచ్ జక్కం నర్సయ్య, నల్లగుంటపల్లిలో సర్పంచ్ వడ్లూరి సంతోష, ఇరుకుల్లలో సర్పంచ్ బలుసుల శారద, చెర్లభూత్కూర్‌లో సర్పంచ్ దబ్బెట రమణారెడ్డి, చామనపల్లిలో సర్పంచ్ బోగొండ లక్ష్మి, ఫకీర్‌పేటలో సర్పంచ్ నందయ్య, బహ్దూర్ఖాన్పేటలో సర్పంచ్ తప్పట్ల భూమయ్య, ఎలబోతారంలో సర్పంచ్ కట్ల లక్ష్మి, నగునూర్‌లో సర్పంచ్ ఉప్పుల శ్రీధర్, జూబ్లీనగర్‌లో సర్పంచ్ రుద్ర భారతి, తాహెర్ కొండాపూర్‌లో సర్పంచ్ మడికంటి మమత, మందులపల్లిలో సర్పంచ్ శకుంతల జాతీయ జెండా ఎగువేశారు. ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
కోర్టు చౌరస్తా, జూన్ 2: జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా జడ్జి ప్రతిమ జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం న్యాయవాదుల ఆహ్వానం మేరకు బార్ అసోసియేషన్ హాల్లో జడ్జి కేక్ కట్ చేశారు. అదనపు జిల్లా జడ్జిలు భవానీ చంద్ర, ఎం వాణి, ఎస్ శ్రీవాణి, కుమార్, వివేక్, లక్ష్మి కుమారి, వీరయ్య, సబ్ జడ్జి ఎం రేణుక, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సుజయ్, మెజిస్ట్రేట్లు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రం రాజారెడ్డి, కార్యదర్శి లింగంపల్లి నాగరాజు, కార్య వర్గ సభ్యులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ముకరంపుర, జూన్ 2: నగరంలోని 18వ డివిజన్లో కార్యాలయంలో కార్పొరేటర్ సుధగోని మాధవీకృష్ణగౌడ్ తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేసి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో డివిజన్ ప్రజలు, నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
విద్యానగర్, జూన్ 2: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల జాతీయ జెండా ఆవిష్కరించారు. ఆర్ఎంవో డాక్టర్ జ్యోతి, వైద్యులు గంగాధర్, నవీనా, పద్మ, అలీం, ఏవో నజీముల్లాఖాన్, ఆకుల ప్రభాకర్, భారతి, పుల్లెల సుధీర్, భీంరావు, తూం రామారావు, రవీందర్, జవ్వాజి హరికృష్ణ, అంజమ్మ పాల్గొన్నారు.
రాంనగర్, జూన్ 2: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని పరిపాలన విభాగం కార్యాలయంలో అడిషనల్ డీసీపీ (పరిపాలన) చంద్రమోహన్, సిటీ ఆర్ముడ్ రిజర్వు హెడ్ క్వార్టర్ (సీఏఆర్) వద్ద సీపీ సత్యనారాయణ జాతీయ జెండా ఎగురవేశారు. అడిషనల్ డీసీపీ ఎస్ శ్రీనివాస్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
కమాన్‌చౌరస్తా, జూన్ 2 : జిల్లా కేంద్రంలోని అమర వీరుల స్థూపం వద్ద తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఇక్కడ తెరవే రాష్ట్ర అధ్యక్షుడు గాజోజు నాగభూషణం, జిల్లా అధ్యక్షుడు కందుకూరి అంజయ్య, కవులు సీవీ కుమార్, బసవేశ్వర్, సరసిజ, వరప్రసాద్, తిరుపతి, వెంకటరమణ, విజయశ్రీ, ఖలీద్ తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న నృత్యాలు
కమాన్‌చౌరస్తా, జూన్ 2: నగరంలోని పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించగా, జవహార్ బాలభవన్ చిన్నారుల నాలుగు బృంద నృత్యాలు, పారమిత విద్యా సంస్థల చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. చిన్నారులను మంత్రి గంగుల కమలాకర్, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు అభినందించారు.