మానకొండూర్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు మండల వ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ముద్దసాని సులోచన, పోలీస్‌స్టేషన్‌లో సీఐ కృష్ణారెడ్డి, మానకొండూర్ విశాల పరపతి సహకార సంఘంలో చైర్మన్ నల్ల గోవిందరెడ్డి, అగ్నిమాపక కేంద్రంలో ఫైర్ అధికారి భూదయ్య, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ వినత, ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇక్కడ ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు, ఎంపీవో రాజేశ్వర్‌రావు, నాయకులు ముద్దసాని శ్రీనివాస్‌రెడ్డి, పిట్టల మధు, ఉండింటి శ్యాంసన్ తదితరులు పాల్గొన్నారు.
మానకొండూర్ మండలంలో..
మానకొండూర్ రూరల్, జూన్ 2: మండలంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మద్దికుంట సర్పంచ్ కొత్తూరి పద్మ- జగన్‌గౌడ్, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, టీఆర్ఎస్ గ్రామాధ్యక్షులు, ఆర్బీఎస్ కన్వీనర్లు, తదితరులు జెండాలను ఆవిష్కరించారు.
శంకరపట్నంలో..
శంకరపట్నం, జూన్ 2: మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఉమ్మెంతల సరోజన, తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ గూడూరి శ్రీనివాస్‌రావు, పోలీస్ స్టేషన్లో ఎస్ఐ చంద్రశేఖర్, వ్యవసాయశాఖ కార్యాలయంలో ఏవో శ్రీనివాస్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి షాకీర్ అహ్మద్, మండల వనరుల కార్యాలయంలో సీఆర్పీ కొమురయ్య, గామ పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు, పాఠశాలల్లో హెచ్ఎంలు జాతీయ జెండాలను ఎగురవేశారు. ఎంపీడీవో టీ జయశ్రీ, ఎంపీవో ఖాజా బషీరొద్దీన్, సూపరింటెండెంట్ శ్రీధర్, నాయబ్ తహసీల్దార్ శ్రీకాంత్, గిర్దావర్ లక్ష్మారెడ్డి, ఏపీవో శారద, మాజీ జడ్పీటీసీ బత్తిని శ్రీనివాస్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గంట మహిపాల్, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది, అధికారులు, తెలంగాణ ఉద్యమ, రాజకీయ పార్టీల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
చిగురుమామిడిలో..
చిగురుమామిడి, జూన్ 2: మండల పరిషత్ కార్యాలయం వద్ద ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్రెడ్డి, సింగిల్ విండో కార్యాలయం వద్ద చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, టీఆర్ఎస్ కార్యాలయం వద్ద గ్రామ శాఖ అధ్యక్షుడు బుర్ర శ్రీనివాస్, రెవెన్యూ కార్యాలయం వద్ద తహసీల్దార్ ముబీన్ అహ్మద్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ఎమ్మార్సీ కార్యాలయం వద్ద ఇన్చార్జి ఎంఈవో శోభారాణి, మండల ఆరోగ్య కేంద్రం వద్ద డాక్టర్ నాగశేఖర్, పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ బెజ్జంకి లక్ష్మణ్, ఐకేపీ కార్యాలయం వద్ద మండల సమాఖ్య అధ్యక్షురాలు కోల హరిణి, రైతు వేదికల వద్ద ఏవో రంజిత్ కుమార్, ఏఈవోలు బొల్లం సౌజన్య, ఫరీద్, సాయి కుమార్, శ్రీనివాస్, సతీశ్‌కుమార్, అంజలి ఆయా క్లస్టర్ల వద్ద సర్పంచులు, రైతు బంధు సమితి గ్రామ కోఆర్డినేటర్లతో కలిసి జెండాను ఎగురవేశారు. ఎంపీడీవో నర్సయ్య, ఎంపీవో శ్రావణ్ కుమార్, సూపరింటెండెంట్ ఖాజా మొయినుద్దీన్, ఎంపీవో లక్ష్మీపేరందేవి, మండల పశువైద్యాధికారి శ్రీధర్, ఐకేపీ ఏపీఎం సంపత్, వైస్ ఎంపీపీ బేతి రాజిరెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ కరివేద మహేందర్‌రెడ్డి, డైరెక్టర్లు చిట్టిమల్ల శ్రీనివాస్, చాడ శ్రీధర్ డ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, మైనార్టీ సెల్ మండలాధ్యక్షుడు ఎండీ సర్వర్ పాషా, నాయకులు ఆకవరం శివప్రసాద్, ముకెర సదానందం, బెజ్జంకి రాంబాబు, పన్యాల భూపతిరెడ్డి, సిద్దెంకి రాజమల్లు, బుర్ర తిరుపతి, గీట్ల తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
తిమ్మాపూర్‌లో..
తిమ్మాపూర్ రూరల్, జూన్2: ఎల్ఎండీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ జెండాను ఆవిష్కరించారు. ఇఫ్కో డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, వైస్‌ఎంపీపీ ల్యాగల వీరారెడ్డి, కార్యాలయ ఇన్చార్జి వెంకట్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కేతిరెడ్డి వనిత, తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ రాజ్‌కుమార్, పోలీస్‌స్టేషన్‌లో ఎస్ఐ ప్రమోద్‌రెడ్డి, స్త్రీ శక్తి భవనంలో ఏపీఎం రామ్మోహన్, గ్రామ పంచాయతీల్లో సర్పంచులు జెండావిష్కరించారు. ఎంపీడీవో రవీందర్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గన్నేరువరంలో..
గన్నేరువరం, జూన్ 2 : మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మామిడాల సురేందర్, రెవెన్యూ కార్యాలయంలో ఇన్చార్జి తహసీల్దార్ మహేశ్‌రావు, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి జెండాలు ఎగురవేశారు. సర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.