తిమ్మాపూర్ రూరల్, మే 24: మండలంలోని రామకృష్ణకాలనీ గ్రామ సర్పంచ్ మీసాల అంజయ్య మరోసారి ఉదారతను చాటుకున్నారు. గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న సుమారు వంద మంది కూలీలకు అవసరమైన సామగ్రిని సొంత ఖర్చుతో సమకూర్చారు. మంగళవారం ఉపాధి పనులు కొనసాగుతున్న చోటుకు వచ్చిన ఆయన కూలీలతో మాట్లాడారు. పని స్థలాల్లో ఏమైనా ఇబ్బందులు ఉంటే తనకు సమాచారం ఇవ్వాలని సూచించారు. తట్టలు, పారలు, గడ్డపారలను వారికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలు సర్పంచ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి పద్మ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.